Kaushik Reddy: ఇంతటితో ముగించాలి.. క్షమాపణ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Kaushik Reddy: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, కొన్ని పరిణామాల వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి కారణంగా నోరు జారిన మాటలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేస్తూ తన వివరణను వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాను సమ్మక్క జాతరకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని తెలిపారు. ఆ సమయంలో కలిగిన ఆవేశం, మానసిక ఆందోళన వల్ల తెలియక కొన్ని మాటలు బయటికి వచ్చాయని చెప్పారు.
పోలీసులు, అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ వ్యవస్థను కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, కానీ ఆ రోజు పరిస్థితులు తన నియంత్రణలో లేకుండా చేశాయని తెలిపారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని వివాదంగా మార్చడం సరైంది కాదని అన్నారు.
తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే వారికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని కౌశిక్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని అందరినీ వేడుకుంటున్నానని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌ను మతం పేరుతో దూషించారనే ఆరోపణలపై ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. పోలీసులు నమోదు చేసిన కేసులో పలు తీవ్రమైన సెక్షన్లు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 126(2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం చట్టపరంగా ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
ALSO READ: Harvard University: లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్