BREAKING: షాక్ ఇచ్చిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు వరుసగా కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. ఒక రికార్డ్ చెరిపివేయకముందే మరో రికార్డు నమోదు అవుతోంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బులియన్ ధరలు ఆల్‌టైమ్ హై స్థాయిలకు చేరుకోవడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని మరింత పెంచింది. కేవలం ఒక్కరోజులోనే తులం బంగారంపై రూ.11 వేలకు పైగా పెరుగుదల నమోదవ్వగా, కిలో వెండి ధర ఏకంగా రూ.25 వేలు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
జనవరి 29న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారట్ స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజులో రూ.11,770 పెరిగి రూ.1,67,080 నుంచి రూ.1,78,850కు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.10,800 పెరిగి రూ.1,53,150 నుంచి రూ.1,63,950కు చేరింది. ఇక 18 క్యారట్ బంగారం ధర కూడా రూ.8,830 పెరిగి రూ.1,34,140గా నమోదైంది.
ఇక వెండి ధరలు కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజులో రూ.25,000 పెరిగి ప్రస్తుతం రూ.4,25,000కు చేరుకుంది. తులం వెండి ధర రూ.4,250గా ఉంది. ఈ స్థాయి ధరలు గతంలో ఎప్పుడూ నమోదు కాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
జనవరి నెల మొత్తాన్ని పరిశీలిస్తే బంగారం, వెండి ధరల్లో అతి భారీ పెరుగుదల కనిపిస్తోంది. కేవలం 29 రోజుల్లోనే 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.42 వేల వరకు పెరగగా, 22 క్యారట్ బంగారం ధర దాదాపు రూ.40 వేల వరకు పెరిగింది. అదే సమయంలో కిలో వెండి ధర ఏకంగా రూ.1,67,000 పెరగడం బులియన్ చరిత్రలో అరుదైన పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 8.37 శాతం పెరిగి రూ.1,79,806 వద్ద ట్రేడవుతుండగా, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 5.09 శాతం పెరిగి రూ.4,04,999 వద్ద కొనసాగుతోంది. ఈ గణాంకాలు బులియన్ మార్కెట్లో బుల్స్ పూర్తి ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 5,500 డాలర్ల మార్క్‌ను దాటి ప్రస్తుతం 5,547 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఔన్స్ వెండి ధర 117 డాలర్ల పరిధిలో కదులుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
డాలర్ బలహీనత, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు బంగారానికి మరింత డిమాండ్‌ను తీసుకొచ్చాయి. ఇక అమెరికా అప్పులు పెరుగుతుండటం, ప్రపంచ వాణిజ్యం ప్రాంతీయ బ్లాక్స్‌గా విడిపోతున్న సంకేతాలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గోల్డ్, సిల్వర్ సేఫ్ హేవన్‌గా మరింత బలపడుతున్నాయి.
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ఇప్పుడు కేవలం సంక్షోభ సమయంలో రక్షణగా ఉపయోగించే ఆస్తి మాత్రమే కాదు. ద్రవ్యోల్బణానికి ఎదురుగానూ, దీర్ఘకాల పెట్టుబడుల కోసం నమ్మకమైన సాధనంగానూ మారింది. మారుతున్న గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడులను విభజించుకునేందుకు బంగారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: VHP: రేపు, ఎల్లుండి సెలవులు ఇవ్వాలని డిమాండ్