మెటాపై అమెరికాలో దావా
వాట్సాప్ భద్రతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. యూజర్ల ప్రైవేట్, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లను కూడా వాట్సాప్ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఓ కీలక దావా దాఖలైంది. ఈ కేసులో ప్రజా వేగులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆరోపణలు చేసినట్లు దావాలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ భద్రతపై ఇలాంటి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
ఈ దావా నేపథ్యంలో వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూజర్ నుంచి యూజర్‌కు వెళ్లే మెసేజ్‌లను మూడవ వ్యక్తులు, లేదా సంస్థలు చదవలేవని ఇప్పటివరకు వాట్సాప్ చెబుతూ వచ్చింది. కానీ తాజా ఆరోపణలు నిజమైతే, ఈ భద్రతా విధానం పూర్తిగా విశ్వసనీయమేనా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
అయితే పేరెంట్ కంపెనీ మెటా ఈ ఆరోపణలను ఖండించింది. యూజర్ల వ్యక్తిగత మెసేజ్‌లకు తమకు ఎలాంటి ప్రాప్తి లేదని స్పష్టం చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల మెసేజ్ పంపినవారు, స్వీకరించినవారు తప్ప మరెవ్వరూ వాటిని చదవలేరని మరోసారి వెల్లడించింది. ఈ దావా ఆధారహీనమని, వాస్తవాలకు విరుద్ధమని మెటా వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసును ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన పలువురు యూజర్లు కలిసి అమెరికా కోర్టులో దాఖలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల వినియోగదారులు ఇందులో భాగస్వాములు కావడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ముఖ్యంగా డేటా భద్రత, గోప్యత అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఈ దావా ఆసక్తికరంగా మారింది.
విజిల్‌బ్లోయర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా లేదా అంతర్గత వ్యవస్థల ద్వారా ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లకు ప్రాప్తి సాధ్యమవుతుందని దావాలో ఆరోపించారు. ఇదే నిజమైతే, యూజర్ల ప్రైవసీపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని న్యాయవాదులు వాదిస్తున్నారు. దీంతో కోర్టు ఈ అంశాన్ని ఎంత లోతుగా పరిశీలిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ఇక భారతదేశంలో కూడా వాట్సాప్ భద్రతపై ఇప్పటికే పలుమార్లు చర్చ జరిగింది. వ్యక్తిగత డేటా, చాట్స్ రక్షణపై ప్రభుత్వం, నిపుణులు ప్రశ్నలు లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. తాజా అమెరికా దావా ప్రభావం భారత్‌లోనూ చర్చకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణలో ఏమి తేలుతుందో, కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై వాట్సాప్ భవిష్యత్ ప్రతిష్ట ఆధారపడి ఉంది. ఒకవేళ ఆరోపణలకు ఆధారాలు లభిస్తే, టెక్ కంపెనీల డేటా భద్రతా విధానాలపై ప్రపంచవ్యాప్తంగా కొత్త నియంత్రణలు వచ్చే అవకాశమూ లేకపోలేదని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం ప్రాథమిక దశలోనే ఉంది. అయినా, యూజర్ల ప్రైవసీ, ఎన్‌క్రిప్షన్ విశ్వసనీయత వంటి అంశాలు మరోసారి గ్లోబల్ స్థాయిలో చర్చకు రావడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు.
ALSO READ: Vastu: ఆఫీసు బ్యాగులో ఈ 5 వస్తువులు పెట్టుకున్నారా..? దరిద్రాన్ని వెంటపెట్టుకున్నట్లే!