టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులు తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 19న సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారుడికి ‘దేవ్ నిడిమోరు’ అని పేరు పెట్టినట్లు నవంబర్ 20న సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ శుభవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు సోదరి శీతల్ చేసిన ప్రత్యేక ప్రార్థనలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన మేనల్లుడు దేవ్ క్షేమంగా, సంతోషంగా ఎదగాలని ఆమె ముంబైలోని మూడు వేర్వేరు మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను సందర్శించారు.
రాజ్ సోదరి శీతల్ తన అత్తతో కలిసి ముంబైలోని ప్రముఖ హాజీ అలీ దర్గా, సిద్ధివినాయక ఆలయం, సెయింట్ మైఖేల్ చర్చిని సందర్శించారు. ఏకాదశి రోజున ఉపవాస దీక్షలో ఉంటూనే ఈ మూడు ప్రార్థనా మందిరాల్లో చిన్నారి దేవ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో సహా పంచుకున్నారు.
దేవ్‌ను దేవుడిచ్చిన అపురూపమైన కానుకగా అభివర్ణించిన శీతల్.. అతడి జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. అన్ని మతాలను గౌరవిస్తూ, ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తూ దేవ్ ఎదగాలని ప్రార్థించినట్లు తెలిపారు.
సమంత, రాజ్‌లు 2025 డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లకు కలిసి పనిచేశారు.
View this post on Instagram


