HomeTELANGANAKavitha: నాగార్జునసాగర్‌లో ఏపీ కొత్త ప్రాజెక్టు.. ఆపకపోతే సాగర్‌కు భారీగా తరలివస్తాం..కవిత హెచ్చరిక!

Kavitha: నాగార్జునసాగర్‌లో ఏపీ కొత్త ప్రాజెక్టు.. ఆపకపోతే సాగర్‌కు భారీగా తరలివస్తాం..కవిత హెచ్చరిక!

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రాంతంలోని నాగార్జునసాగర్ డ్యామ్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మిస్తోందని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన కవిత.. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించకుండా, తెలంగాణ సమ్మతి లేకుండానే ప్రాజెక్టు పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసిన కవిత.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నాగార్జునసాగర్ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను వారం రోజుల్లోగా నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాది మంది తెలంగాణవాదులతో కలిసి నాగార్జునసాగర్‌కు భారీగా తరలివస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలు, రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.తెలంగాణ అనుమతి లేకుండా రాష్ట్ర భూభాగంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడాన్ని సహించబోమని పేర్కొన్నారు.

కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular