Kavitha: నాగార్జునసాగర్‌లో ఏపీ కొత్త ప్రాజెక్టు.. ఆపకపోతే సాగర్‌కు భారీగా తరలివస్తాం..కవిత హెచ్చరిక!
తెలంగాణ ప్రాంతంలోని నాగార్జునసాగర్ డ్యామ్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మిస్తోందని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన కవిత.. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించకుండా, తెలంగాణ సమ్మతి లేకుండానే ప్రాజెక్టు పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసిన కవిత.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు...