HomeTOURS & TRAVELSTravel Destinations: లైఫ్‌లో మిస్ అవ్వకూడని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఇవే!

Travel Destinations: లైఫ్‌లో మిస్ అవ్వకూడని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఇవే!

📰 Generate e-Paper Clip

మీ జీవితంలో మరచిపోలేని ప్రయాణ అనుభూతులను పొందాలనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను ఓ సారి చూద్దామా..ప్రపంచంలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, అద్భుతమైన నగరాలు, అందమైన బీచ్‌లు.. ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. అయితే, ఎక్కడికి వెళ్లాలి? ఏ ప్రదేశాలను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి? అనే ప్రశ్నలు చాలామంది ప్రయాణ ప్రియులకు ఎదురవుతుంటాయి.

కొన్నిసార్లు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, రుచికరమైన ఆహార పదార్థాలు, విలాసవంతమైన హోటళ్లు మనల్ని ఆకర్షిస్తాయి. మరికొన్నిసార్లు కొత్త దేశాలను, ఖండాలను సందర్శించాలనే కోరిక ప్రయాణాలకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాల వివరాలను తెలుసుకుందాం.

()ఇటలీలోని రోమ్, వెనిస్, నేపుల్స్, ఫ్లోరెన్స్ నగరాల్లో ఏది అత్యంత అందమైనదో నిర్ణయించడం కష్టమే. అందుకే ఇటలీ దేశం మొత్తం పర్యాటకుల జాబితాలో ఉండాల్సిందే. ముందుగా చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన రోమ్ నగరాన్ని సందర్శించాలి. అక్కడి నుంచి టస్కనీ కొండ ప్రాంతాల మీదుగా ఫ్లోరెన్స్ చేరుకోవచ్చు. అనంతరం మిలాన్, వెనిస్ నగరాలను చూడొచ్చు. లేదంటే దక్షిణ ఇటలీలోని అందమైన అమాల్ఫీ తీరప్రాంతం, సిసిలీ దీవులను సందర్శించవచ్చు.

()ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లో న్యూయార్క్ ఒకటి. ఇక్కడి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బ్రూక్లిన్ బ్రిడ్జ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. సినిమాల్లో చూసిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారికి ఈ నగరం మంచి ఎంపిక.

() పారిస్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ ప్రాంతం. ఈఫిల్ టవర్ అందాలను వీక్షించడం, ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలలోని కళాఖండాలను చూడటం, ఫ్రెంచ్ బేకరీలకు ప్రత్యేకమైన రుచికరమైన పదార్థాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకతలు. పారిస్‌తో పాటు మోంట్ సెయింట్ మైఖేల్, చామోనిక్స్, ఫ్రెంచ్ రివేరా వంటి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు.

() విభిన్న సంస్కృతులు, ప్రత్యేకమైన నిర్మాణ శైలి, సందడిగా ఉండే పురాతన మార్కెట్లు మొరాకో దేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక్కడి మర్రాకెష్ నగరం, అందమైన తీరప్రాంత పట్టణాలు, ఎడారి ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వీలైతే ఈ మూడు ప్రాంతాలను సందర్శించడం ద్వారా మొరాకో ప్రత్యేకతలను పూర్తిగా ఆస్వాదించవచ్చు.

() గ్రీస్‌లోని శాంటోరిని దీవిలో తెల్లని ఇళ్లు, నీలిరంగు సముద్రం పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఐయోస్ దీవిలో సందడి చేసే పార్టీల వాతావరణం, మిలోస్ దీవిలో ప్రశాంతమైన ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణలు. వివిధ దీవులను సందర్శిస్తూ ప్రయాణించడం ద్వారా గ్రీస్ అందాలను మరింత ఆస్వాదించవచ్చు. ఈ ప్రయాణానికి ముందు లేదా చివర్లో ఏథెన్స్ నగరంలో రెండు రోజులు గడపడం మంచిది.

()సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు వంటి అడవి జంతువులను వాటి సహజ ఆవాసాల్లో చూడాలనుకునేవారికి ఆఫ్రికన్ సఫారీ ఉత్తమ ఎంపిక. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, టాంజానియా, ఉగాండా, కెన్యా దేశాలు సఫారీ ప్రయాణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ దేశాల్లో ప్రత్యేకమైన రిసార్టులు, సఫారీ టూర్ నిర్వాహకులు పర్యాటకులకు అందుబాటులో ఉంటారు. వారి సహాయంతో అడవి జంతువులను దగ్గరగా వీక్షించవచ్చు.

() పురాతన నాగరికతకు నిలయమైన ఈజిప్ట్ చరిత్ర, సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ప్రపంచ ప్రసిద్ధ నైలు నదిలో విహారయాత్ర చేయడం, గిజా పిరమిడ్లను సందర్శించడం, పురాతన రాజుల సమాధులకు ప్రసిద్ధి చెందిన వ్యాలీ ఆఫ్ ది కింగ్స్‌ను చూడటం ఇక్కడి ప్రత్యేకతలు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కట్టడాలు పురాతన నాగరికత గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తాయి.

() ప్రశాంతత, విలాసం, ప్రేమభరితమైన వాతావరణానికి మాల్దీవులు ప్రసిద్ధి. నీలిరంగు సముద్రపు నీటిపై నిర్మించిన ఓవర్‌వాటర్ బంగ్లాల్లో బస చేయడం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. హడావుడి లేని ప్రశాంతమైన విహారయాత్ర కోరుకునేవారికి ఈ ప్రాంతం మంచి ఎంపిక. అయితే ఇక్కడి విలాసవంతమైన వసతి సౌకర్యాలు కొంత ఖరీదైనవిగా ఉంటాయి.

()ప్రపంచ పర్యాటక ప్రాంతాల జాబితాలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో సందర్శించదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నప్పటికీ విదేశీ పర్యాటకులు ఎక్కువగా చూడాలనుకునే కట్టడాల్లో తాజ్‌మహల్ ముందుంటుంది. 17వ శతాబ్దంలో తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ అద్భుత సమాధి ఆగ్రాలో ఉంది. విలాసవంతమైన రైలు ప్రయాణాన్ని ఇష్టపడేవారు మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ తాజ్‌మహల్‌ను సందర్శించవచ్చు.

()భారత్, పాకిస్థాన్, చైనా, భూటాన్, నేపాల్ దేశాల మీదుగా విస్తరించిన హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులకు నిలయం. సాహసయాత్రలను ఇష్టపడేవారు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యం లేకపోయినా, బేస్ క్యాంప్ వరకు చేసే ప్రయాణం జీవితంలో మరచిపోలేని అనుభూతిని అందిస్తుంది.

()ప్రపంచంలోనే అత్యల్ప జనసాంద్రత కలిగిన దేశాల్లో నమీబియా ఒకటి. ఇక్కడి విశాలమైన ఎడారి ప్రాంతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారిగా పేరొందిన నమీబ్ ఎడారి ఈ దేశంలోనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇసుక దిబ్బల్లో కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఎడారి, అట్లాంటిక్ మహాసముద్రం కలిసే దృశ్యం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.

RELATED ARTICLES

Most Popular