HomePOLITICALKavitha:సిద్దిపేటలో కల్వకుంట్ల కవిత పర్యటన..టీఆర్ఎస్‌ కార్యాలయ భవనానికి భూమి పూజ!

Kavitha:సిద్దిపేటలో కల్వకుంట్ల కవిత పర్యటన..టీఆర్ఎస్‌ కార్యాలయ భవనానికి భూమి పూజ!

📰 Generate e-Paper Clip

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలోనూ తెలంగాణ రక్షణ సేన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి (తెలంగాణ అమరవీరుల స్తూపం) చౌరస్తాలో ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్ భవన నిర్మాణానికి కవిత భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో స్థానిక పార్టీ శ్రేణులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

కవిత సిద్దిపేట టూర్ షెడ్యూల్ ఇదే:

ఉదయం 7:00 గంటలకు: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసం నుండి కవిత సిద్దిపేటకు బయలుదేరుతారు.

ఉదయం 9:00 గంటలకు: సిద్దిపేటకు చేరుకుని ముందుగా శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆలయ దర్శనం అనంతరం సిద్దిపేట మినార్ సమీపంలోని జానుల్లా షా దర్గాలో చాదర్ సమర్పిస్తారు. ఆ తర్వాత ఆర్డీవో కార్యాలయం సమీపంలోని సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

ఉదయం 10:00 గంటలకు: రంగధాంపల్లి చౌరస్తాకు చేరుకుని తెలంగాణ రక్షణ సేన నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.

ఉదయం 11:00 గంటలకు: పార్టీ ఆఫీస్ నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడనున్నారు.

సిద్దిపేటలో పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు కవిత వస్తుండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular