రామాయణం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
భారతీయ సినిమాను తనదైన భారీ కథాకథనాలతో కొత్త స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎపిక్ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రామాయణం సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై దాని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సినిమా అందించే గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
రాముడిగా రణ్‌బీర్ కపూర్, ముఖ్యంగా వనవాసం నుంచి ఎంతో అద్భుతమైన ఔన్నత్యంతో కనిపించారు. రావణుడిగా యశ్ ప్రజెన్స్ అద్భుతంగా వుంది. సీతగా సాయి పల్లవి ఎంతో హుందాగా కనిపించారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ నాకు ఎంతగానో నచ్చాయి. సినిమాలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన విజన్‌ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన చిత్ర బృందానికి అభినందనలు అని పేర్కొన్నారు.

