: టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజప్రభాకర్
స్టార్ త్రినేత్రం, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు మండలాల్లో రహదారుల విస్తరణ పనుల కారణంగా ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేపట్టడం స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ, వాటి కారణంగా నిరాశ్రయులవుతున్న పేద కుటుంబాల ఇబ్బందులను ప్రభుత్వం విస్మరించకూడదని పేర్కొన్నారు. జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిర్మించుకున్న ఇళ్లు కూలిపోతుంటే బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని అన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తక్షణ పరిహారం అందించడంతోపాటు, అవసరమైన పునరావాస చర్యలు చేపట్టాలని రాజప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

