Crime Thriller: త్రిష నటించిన ఏకైక వెబ్ సిరీస్.. చూస్తే గుండె దడ పుట్టుద్ది

Crime Thriller: దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ త్రిష పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రాజకీయంగా ఘన విజయం సాధించడంతో విజయ్‌కు సన్నిహితంగా భావించే సినీ ప్రముఖుల పేర్లు కూడా నెట్టింట మారుమోగుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిష నటించిన సినిమాలు, పాత్రలు, వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు 2 దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష ఇప్పటికీ అదే అందం, అదే క్రేజ్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా కూడా త్రిష స్థాయిలో అభిమాన గణాన్ని సంపాదించడం అంత ఈజీ కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్థాయికి చేరుకున్న త్రిష, సినిమాలతో పాటు ఓటీటీ ప్రపంచంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద కెరీర్‌లో ఆమె కేవలం ఒక్క వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. కానీ ఆ ఒక్క సిరీస్‌తోనే ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసింది. సుమారు 2 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ వేదికను కుదిపేసింది. సస్పెన్స్, భావోద్వేగాలు, భయానక వాతావరణం, మూఢనమ్మకాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠకు గురి చేసింది.

ఈ సిరీస్ కథ ఒక గ్రామంలో వరుసగా అదృశ్యమవుతున్న మహిళలు, చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. విధి నిర్వహణలో భాగంగా త్రిష పోషించిన బృంద అనే ఎస్సై ఓ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వస్తుంది. అక్కడ ఆమెకు సహచర అధికారుల నుంచి సరైన గౌరవం దక్కదు. మహిళా అధికారి కావడంతో అవమానాలు, నిర్లక్ష్యం, చిన్నచూపు ఎదుర్కొంటుంది. అయితే అదే సమయంలో స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 మంది మహిళలు, చిన్నారులు కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది. ఆ తర్వాత వారు హత్యకు గురైనట్లు బయటపడటంతో కేసు మరింత భయానకంగా మారుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలే ఈ సిరీస్ ప్రధాన కథాంశంగా సాగుతాయి.

త్రిష నటించిన ఈ సిరీస్ పేరు ‘బృందా’. ప్రముఖ దర్శకుడు సూర్య మనోజ్ వంగాలా తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించారు. మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రతి భాగం సుమారు 40 నిమిషాల నిడివితో ఉంటుంది. కథనం నెమ్మదిగా మొదలై క్రమంగా ఉత్కంఠను పెంచే విధంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు చివరి వరకు ఆసక్తిగా చూస్తారు.

ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీ వేదికలో అందుబాటులో ఉంది. సస్పెన్స్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ మంచి అనుభూతిని ఇస్తుందని సినీ అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా త్రిష నటన, భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె చూపించిన తీవ్రత ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఇప్పుడు మళ్లీ ‘బృందా’ సిరీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ: Roopa Muggalla: మరీ ఇంత అందమా!.. సినిమా హీరోయిన్స్ చూస్తే ఎంత కుళ్లుకుంటారో..?

Last Updated on May 8, 2026 · 9:06 AM by kiran Kumar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles