నెట్టింట వైరల్ అయిన వీడియో
రాజకీయ వాతావరణంలో సంచలనం
ఫేస్బుక్ పరిచయం తర్వాత ప్రారంభమైన పరిణామాలు
అండగా ఉంటానని ఇచ్చిన భరోసా
న్యూడ్ ఫోటోలు అడిగిన ప్రయత్నాలు
వీడియో కాల్ కోసం బలవంతం
స్టార్ త్రినేత్రం, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే (ప్రభుత్వ విప్) అరవ శ్రీధర్ పట్ల తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూసి రాజకీయ వాతావరణం వెడెక్కింది. ఇటీవల నెట్టింట వైరల్గా మారిన ఒక వీడియోలో, బాధితురాలిగా గుర్తించిన మహిళ.. తన వ్యక్తిగత అనుభవాలను వెల్లడిస్తూ ఘోర ఆరోపణలు చేసిన విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బాధితురాలు మంగళవారం ఒక వీడియో విడుదల చేసింది. “ఆ వీడియోలో ఉన్న మహిళను నేనే. నేను రైల్వే కోడూరులో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. గత సంవత్సరం జూన్ 14, 2024న ఆయన రైల్వే కోడూరు ఎమ్మెల్యే కావడంతో ఫేస్బుక్లో కంగ్రాట్స్ చెప్పాను. మొదటి రోజు ఆయన నాతో 2, 3 గంటలు మాట్లాడాడు. నా నెంబర్ తీసుకొని, తన నెంబర్ ఇచ్చాడు. టెలిగ్రామ్ ద్వారా మెసేజ్లు పంపాడు. నా కుటుంబ నేపథ్యం, పరిస్థితులు తెలుసుకుంటూ నాకు అండగా ఉంటానని చెప్పాడు” అని బాధితురాలు తెలిపింది.
మొదట నార్మల్ పరిచయం అయినప్పటికీ, రెండురోజుల తర్వాత అరవ శ్రీధర్ న్యూడ్ ఫోటోలు పంపించాలని, వీడియో కాల్ చేయమని బలవంతం చేశారని ఆరోపించింది. ఆమె కఠినంగా నిరాకరించినప్పటికీ, ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అణచివేతలు, ట్రాన్స్ఫర్ల బెదిరింపులు వంటి కుట్రలతో తనపై ఒత్తిడులు చేసినట్లు తెలిపారు.
జూలై 9న ఫస్ట్ టైమ్ కలిసిన తర్వాత, కారు ద్వారా రాజంపేట ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెకు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఘోర ఆరోపణలు చేశారు. ఆమె నిరాకరించినప్పటికీ, ఎమ్మెల్యే తనకు శారీరకంగా దాడి చేసినట్లు పేర్కొన్నారు.
ఆమె ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, అబార్షన్ చేయించమని ఒత్తిడి చేశాడు. కానీ పెళ్లి చేసుకుంటానని ప్రామీస్ చేసిన తర్వాత అబార్షన్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో మొత్తం 5 సార్లు అబార్షన్కి ఒప్పించారని, నా భర్తకు కాల్ చేసి విడాకులు ఇవ్వమని బెదిరింపులు చేశారని ఆమె వివరించారు.
ఆ తర్వాత ఈ విషయం మా ఇంట్లో వారికి చెప్పాను, ఈ ఘోర పరిస్థితులను తెలియజేసినప్పటి నుంచి ఆమెకు నిజమైన న్యాయం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నెట్టింట చర్చనీయాంశంగా మారి, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన సృష్టించాయి.
ALSO READ: Protocol Controversy: రాహుల్ గాంధీ, ఖర్గేకి మూడో వరుసలో సీటు
Last Updated on January 28, 2026 · 5:30 PM by Star Trinethram



