Atrocious: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా గురజాడ గాయత్రి కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థినుల ఫోటోలను AI టెక్నాలజీని ఉపయోగించి మార్ఫింగ్ చేసిన ఘటన బయటపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలోనే చదువుతున్న కొందరు విద్యార్థులు ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ విద్యార్థినుల ఫోటోలను మార్పింగ్ చేసి అనుచితంగా వినియోగించారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయం బయటపడిన వెంటనే విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు.
విద్యార్థినుల తల్లిదండ్రుల ప్రకారం.. వారి కుమార్తెల ఫోటోలను అనుమతి లేకుండా సేకరించి వాటిని మార్పింగ్ చేసి బయటకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య వల్ల తమ పిల్లల గౌరవం దెబ్బతిందని, ఇది తీవ్రమైన తప్పిదమని వారు పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, గౌరవం కాపాడాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన తల్లిదండ్రులు వెంటనే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే కళాశాల యాజమాన్యం ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఘటనలో ప్రమేయం ఉన్న విద్యార్థులను గుర్తించిన తరువాత వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ కేవీవి సత్యనారాయణ వెల్లడించారు. విద్యార్థులపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత ఐదుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చి కళాశాల నుంచి బయటికి పంపినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థుల భద్రతకు కళాశాల యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తుందని, ఇలాంటి చర్యలకు ఎలాంటి సహనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులు AI టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించాల్సిన సమయంలో వాటిని తప్పుదోవ పట్టించేలా వినియోగించడం సమాజానికి ఆందోళన కలిగించే అంశంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విద్యార్థుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ALSO READ: Health Tips: సులభమైన యోగాసనంతో స్లీమ్ అవ్వండి!
Last Updated on March 12, 2026 · 10:24 PM by Star Trinethram



