Yasmin Jahan: అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు

పితృస్వామ్యపు చీకట్లలో
నిశ్శబ్దంగా నడిచిన అడుగు..
ఈ రోజు మాతృస్వామ్యపు వెలుగై
ప్రపంచాన్ని వెలిగించే దీపం..

భారంగా మోసిన బాధలు
ఆమెను విరగగొట్టలేదు..
అవి ఆమెను మరింత
దృఢమైన శిలలా తీర్చిదిద్దాయి..

అనుమతి అడిగిన స్వరం
ఇప్పుడు ఆజ్ఞగా మారింది..
బానిసగా బతికిన కాలం
ఈ రోజు యాజమాన్యంగా నిలిచింది..

పంజరంలో బంధించిన పక్షి కాదు ఇక
ఆకాశాన్ని తాకే గరుత్మంతి ఆమె..
భయంతో నిండిన హృదయం కాదు ఇక
అభయం ఇచ్చే ధైర్యమే ఆమె..

పురుషుడి వెనకాల నడిచిన కాలం గడిచింది
ఇప్పుడు అతని పక్కనే నిలబడి
ప్రపంచాన్ని నడిపించే శక్తిగా మారింది.. ‘మగువ’

– యాస్మీన్ జహాన్
ఎస్జీటీ
ఎంపీపీఎస్ కాశగూడెం
ధర్మసాగర్
హనుమకొండ

Last Updated on March 8, 2026 · 5:29 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles