Ujas ego LA: గత కొంతకాలంగా భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు రోజురోజుకూ భారంగా మారుతుండటంతో, వినియోగదారులు గ్రీన్ ఎనర్జీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అధిక ధరతో ఉండటంతో, బడ్జెట్లో లభించే ఈవీల కోసం కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ఉజాస్ ఎనర్జీ కంపెనీ శుభవార్త చెప్పింది. తక్కువ ధరలోనే చక్కటి ఫీచర్లు, సరైన రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఉజాస్ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరే ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది. ఉజాస్ ఇగో ఎల్ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ.34,880 నుంచి రూ.39,880 (ఎక్స్-షోరూమ్) ధరలో అందిస్తోంది. ఆన్‌రోడ్ ధర కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సెగ్మెంట్లో ఇది అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. తక్కువ ధర అయినప్పటికీ అవసరమైన ఫీచర్లు, రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్ ఇవ్వడం ఈ స్కూటర్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఉజాస్ ఇగో ఎల్ఏ స్కూటర్లో 1.56 kWh సామర్థ్యం గల బ్యాటరీ ఆప్షన్‌తో సుమారు 75 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. అదే విధంగా 1.248 kWh బ్యాటరీ వేరియంట్లో సుమారు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది ముఖ్యంగా నగరాల్లో రోజువారీ తక్కువ దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్, లైసెన్స్ అవసరం లేని కేటగిరీలోకి వస్తుంది. దీంతో విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, షార్ట్ కమ్యూట్స్ చేసే వారు దీన్ని సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే 1.56 kWh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఇందులో 250 వాట్స్ సామర్థ్యం గల BLDC హబ్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇవ్వడంతో పాటు, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండేలా చేస్తుంది. రోజూ పెట్రోల్ ఖర్చుల భారం లేకుండా ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఫీచర్ల విషయంలో కూడా ఉజాస్ ఇగో ఎల్ఏ స్కూటర్ నిరాశపరచదు. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉండి, స్పీడ్, బ్యాటరీ ఛార్జింగ్ స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. మెరుగైన విజిబిలిటీ కోసం LED హెడ్లైట్లు, టెయిల్ లైట్లు అందించారు. సులభంగా వెనక్కి తిప్పేందుకు రివర్స్ గేర్, కీలెస్ స్టార్ట్ సిస్టమ్, వీల్ లాకింగ్ మెకానిజం వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు USB ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు.
బ్రేకింగ్, టైర్ల విషయానికి వస్తే ముందు, వెనుక డ్రమ్ బ్రేకులు అందించారు. ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్‌తో ఈ స్కూటర్ వస్తుంది. పలు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, నగరాల్లో రోజువారీ ప్రయాణాలు, షార్ట్ రైడ్స్ కోసం సరైన ఎంపికగా కనిపిస్తోంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఉజాస్ ఇగో ఎల్ఏ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా మార్కెట్లో నిలుస్తోంది.
ALSO READ: OTT Horror Movie: మంచి మసాలా హారర్ థ్రిల్లర్ మావా.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారు
Last Updated on February 5, 2026 · 5:59 PM by Star Trinethram



