HomeతెలంగాణKhairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Khairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రనగర్, జూబ్లీహిల్స్ డివిజన్ బస్తీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల బతుకమ్మ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. వాడవాడలా, బస్తీబస్తీలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక మహిళలు, బస్తీవాసులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల బతుకమ్మ వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జ్‌లు గీత గౌడ్, డీకొండ కవిత, సోనిక చామకూర బస్తీవాసులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. రానున్న రోజుల్లోనూ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో బతుకమ్మ వేడుకలను కొనసాగించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ALSO READ: Nagaram Division: ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో ఏనుగు సుదర్శన్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular