Collector: ఎన్నికల నిబంధనల అమలులో రాజీ ఉండదు

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సత్య శారద దృష్టి

పకడ్బందీగా చేపట్టే దిశగా కీలక అడుగులు

ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు

స్టార్ త్రినత్రం, వర్ధన్నపేట: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్య శారద, జనరల్‌ అబ్జర్వర్‌ కిల్లు శివకుమార్‌ నాయుడు సమక్షంలో పోలింగ్‌ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం ఉండేలా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ర్యాండమైజేషన్‌ సమయంలో ప్రతి అంశాన్ని కలెక్టర్‌, జనరల్‌ అబ్జర్వర్‌లు నిశితంగా పరిశీలిస్తూ, ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు.

జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్‌ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ మూడవ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా సిబ్బందిని కేటాయించారు. ఇందులో భాగంగా మొత్తం 80 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 80 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, 240 మంది ఇతర పోలింగ్‌ అధికారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను మరింత పర్యవేక్షించేందుకు 17 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. అదేవిధంగా ఎలాంటి అనివార్య పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు 20 శాతం రిజర్వ్‌ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్‌ రోజున ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో స్థానికేతర సిబ్బందిని పోలింగ్‌ విధుల కోసం ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ సత్య శారద వివరించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను పారదర్శకంగా చేపడుతున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల అమలులో ఏమాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామ్‌ రెడ్డి, జిల్లా నోడల్‌ అధికారి నర్సింహ మూర్తి, ఎన్నికల డీటీ రంజిత్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటుండటంతో, అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు.

ALSO READ: Nakka Srinivas Yadav: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకే ‘ప్రతిభా పాటవ పరీక్ష

Last Updated on February 9, 2026 · 3:34 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles