యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి- మోడెం కుమారస్వామి
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సామాజిక కార్యకర్త మోడెం కుమారస్వామి పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన పలు క్రీడా పోటీల్లో రాణించిన వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన జోగుల దీపికను జనజాగృతి వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

దీపిక జఫర్‌ఘడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఇటీవల ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడలో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచింది. కేసముద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని జట్టుగా రెండోస్థానంలో నిలిచింది.
క్రీడాకారిణి దీపికతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్న దీపిక తల్లిదండ్రులు జోగుల శారద-భాస్కర్ దంపతులను గ్రామస్థులు సత్కరించారు. భవిష్యత్తులో క్రీడల్లో రాణించేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని, చురుగ్గా పాల్గొని గ్రామం పేరు జాతీయ స్థాయిలో నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాయపురం కుమారస్వామి, మాజీ ఉపసర్పంచ్ నాంపల్లి యాకయ్య, గోపి, దూడయ్య, యాదగిరి, జోగుల ఎల్లస్వామి, రాజ్‌కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి- మోడెం కుమారస్వామి