Tamil Nadu : తండ్రి డెడ్ బాడీ ముందే ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యువకుడు
తల్లి కనిపించేలా ప్రేమను చూపిస్తే తండ్రి మాత్రం గంభీరంగా కనిపిస్తాడు. అలా అని అతనికి పిల్లల మీద కోపమున్నట్టు కాదు.. ప్రేమ లేదనీ కాదు. పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపేందుకు, క్రమశిక్షణగా పెంచే మార్గంలో తాను దూరమవుతూ కావల్సిన సౌకర్యాలను అందించేవాడే నాన్న
Tamil Nadu : తల్లి కనిపించేలా ప్రేమను చూపిస్తే తండ్రి మాత్రం గంభీరంగా కనిపిస్తాడు. అలా అని అతనికి పిల్లల మీద కోపమున్నట్టు కాదు.. ప్రేమ లేదనీ కాదు. పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపేందుకు, క్రమశిక్షణగా పెంచే మార్గంలో తాను దూరమవుతూ కావల్సిన సౌకర్యాలను అందించేవాడే నాన్న. పిల్లలకు కూడా అలాంటి నాన్న అంటే ఎందుకు మాత్రం ప్రేముండదు. అలాంటి పిల్లలే తన కష్టం, నష్టం, ఆనందం అన్నీ తల్లిదండ్రులతోనే పంచుకోవాలని చూస్తుంటారు. అలాగే ఓ కొడుకు తన తండ్రిపై ఎంత ప్రేముందో చాటుకున్నాడు. మాటలతో టైం వేస్ట్ చేయకుండా.. చేతల ద్వారా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మృతదేహం ఎదుట ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు.. ఆయన ఆశీస్సులు తనకు కావాలని ఈ పని చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీపంలోని కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన కుమారుడు అప్పు. అతను ప్రస్తుతం లా చదువుతున్నాడు. అప్పు విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అంతలోనే అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. తండ్రి చనిపోవడంతో అప్పు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతికి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అంతిమయాత్రకు ముందే తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులో మాటను ప్రియురాలు విజయశాంతికి చెప్పాడు.. ఆమె కూడా అప్పు పరిస్థితిని, తండ్రిపై ఉన్న ప్రేమను అర్ధం చేసుకుని పెళ్లికి ఒప్పుకుంది. అప్పు ప్రియురాలిని తండ్రి మృతదేహం ఎదుట కీన్నీళ్లు పెట్టుకుంటూనే పెళ్లి చేసుకున్నాడు. కొత్త జంటను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు ఆశీర్వదించారు. కాకపోతే అమ్మాయి తరఫు బంధువులు ఈ పెళ్లికి రాలేదు.. పుట్టెడు దుఃఖంలో కూడా అప్పు కుటుంబం ఈ పెళ్లిని జరిపించడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా తండ్రి ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉండాలన్న తన సంకల్పంతో చేసిన ఈ పనికి నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే.
Also Read: Late Marriage : 30 తర్వాత లేదా లేట్ గా పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టాలివే
Tamil Nadu : తండ్రి డెడ్ బాడీ ముందే ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యువకుడు