Free Calls : ఈ చిన్న ట్రిక్ తో రీచార్జ్ లేకుండానే ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు
ప్రజెంట్ డేస్ లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. దీంతో డేటా చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కంపెనీ డేటా ప్యాక్ చూసినా చాలా ఖరీదుతో కూడినదిగానే కనిపిస్తుంది.
Free Calls : ప్రజెంట్ డేస్ లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. దీంతో డేటా చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కంపెనీ డేటా ప్యాక్ చూసినా చాలా ఖరీదుతో కూడినదిగానే కనిపిస్తుంది. అయితే చాలా మంది తెలియని విషయమేమిటంటే.. ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండా యాక్టివ్ ఉచిత కాల్స్ లభిస్తాయి. ఇందుకు మీకు కావల్సిందల్లా కేవలం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, వైఫై కాలింగ్ మాత్రమే. కనెక్ట్ అయి ఉన్నప్పుడు అనవసరమైన రీఛార్జ్‌లను నివారించడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది.
వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఎలా చేయాలంటే..
మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను తెరవాలి. అనంతరం నెట్వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. అయితే మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును ఎంచుకోవాలి.
కిందకి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్ను ఎంచుకోవాలి. అనంతరం వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేయాలి.
యాక్టివేట్ అయిన తర్వాత, మొబైల్ నెట్వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా మీ పరికరాల్లో అందుబాటులో లేనప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్ల కోసం ఆటోమెటిక్‌గా వైఫైను ఉపయోగిస్తుంది.
Also Read : Akshaya Tritiya: రూ.16వేల కోట్ల బిజినెస్.. బంగారం కొనుగోళ్లపై ఓ రేంజ్ లో అంచనాలు
Free Calls : ఈ చిన్న ట్రిక్ తో రీచార్జ్ లేకుండానే ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు