Facial : భార్య ఫేషియల్ చేయించుకుంటే చూడలేక.. జుట్టు కట్ చేసిన భర్త
ఇప్పుడు మేకప్ లేకుండా ఏ చిన్న ఫంక్షన్ కూ వెళ్లడం లేదు. ఇక పెళ్లిల్లకైతే చెప్పనే అక్కర్లేదు. వారం ముందు రోజుల నుంచే ముఖానికి అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ, క్రీములు రాస్తుండడం చూస్తూనే ఉంటాం.
Facial : ఇప్పుడు మేకప్ లేకుండా ఏ చిన్న ఫంక్షన్ కూ వెళ్లడం లేదు. ఇక పెళ్లిల్లకైతే చెప్పనే అక్కర్లేదు. వారం ముందు రోజుల నుంచే ముఖానికి అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ, క్రీములు రాస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ అది సహించలేని మగాళ్లూ ఉంటారండోయ్. అలా ఓ భార్య ముఖానికి ఫేషియల్ చేయించుకోవడం ఇష్టం లేని భర్త ఏం చేశాడో తెలిస్తే ముక్కు మీద వేలేసుకోకుండా ఉండలేరు. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా.. ఆ కోపంలో భార్య జుట్టు కట్ చేసి తన ఆవేశాన్ని వెల్లగక్కాడు. చివరికి అది ఆ భర్తపై కేసు నమోదయ్యే వరకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలోని సరాయి ముల్లాగంజ్ కు చెందిన రాధాకృష్ణ తన కుమార్తె సుమన్ ను హర్బాల్ పూర్ కు చెందిన రామ్ ప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని చెప్పి ఇటీవలే సుమన్ తన పుట్టింటికి వచ్చింది. పెళ్లి కదా అని కొంచెం అందంగా కనిపించాలన్న కోరికతో బ్యూటీపార్లర్ కు వెళ్లి.. ఫేషియల్, ఐబ్రోస్ కూడా చేయించుకుంది. అప్పుడే అసలు కథ మొదలైంది.
భర్త రామ్ ప్రసాద్ కూడా ఆ పెళ్లి చూసేందుకు అత్తమామల ఇంటికి వెళ్లాడు. అక్కడ తన భార్య మేకోవర్ చేసుకోవడం చూసి సహించలేకపోయాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అలా వారిద్దరి మధ్యా మాటా మాటా పెరిగి గొడవ పెద్దగా మారింది. దీంతో రామ్ ప్రసాద్ సుమన్ పై దాడి చేశాడు. అంతే కాదు తన అత్తామామల ముందే భార్య జుట్టును కత్తితో కట్ చేసి అక్కడ్నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం ఈ ఘటనపై సుమన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లుడు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ఫ్రిడ్జ్, కూలర్ లాంటి వస్తువులు కావాలని డిమాండే చేస్తున్నాడని.. అందులో భాగంగానే తమ కుమార్తె జుట్టు కత్తిరించారని వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. భార్య అందంగా ఉంటే చూడాలని చాలా మంది భర్తలు అనుకుంటారు. కానీ ఇతగాడేమో ఈ పని చేశాడేంటో అని ఈ విషయం తెలుసుకున్న కొందరు గుసగుసలాడుతున్నారు.
Also Read : Exams: మీరు పాస్ చేయకపోతే.. ప్రేమలో విఫలమైనట్టే.. వైరల్ అవుతోన్న స్టూడెంట్స్ ఆన్సర్ షీట్స్
Facial : భార్య ఫేషియల్ చేయించుకుంటే చూడలేక.. జుట్టు కట్ చేసిన భర్త