‘మౌని అమావాస్య’ ఎందుకంత ప్రత్యేకమంటే..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఎంతో ఘనంగా ప్రారంభమైన కుంభమేళా.. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు గంగా నదిలో స్నానం ఆచరిస్తారు. అయితే కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ఎంతో ప్రత్యేకమైన భావిస్తారు. అందులో మౌని అమావాస్య ఒకటి.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఎంతో ఘనంగా ప్రారంభమైన కుంభమేళా.. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు గంగా నదిలో స్నానం ఆచరిస్తారు. అయితే కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ఎంతో ప్రత్యేకమైన భావిస్తారు. అందులో మౌని అమావాస్య ఒకటి. మాఘమాసంలో వచ్చే అమావాస్యనాడు గంగా నదుల స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మౌని అమావాస్య జనవరి 29న వచ్చింది. అయితే అసలు ఈ అమావాస్య కోసం పురాణాలు ఏం చెబుతున్నాయమో తెలుసుకుందాం.
మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో మౌని అమావాస్య రావటం ఎంతో విశేషమని చెబుతున్నాయి హిందూ పురాణాలు. నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుందని.. మౌనం వలన కలిగే లాభాలను గుర్తు చేస్తుందని తెలుపుతున్నాయి. మౌనం అంటే బాహ్యం కాదని.. అంతర్గతంగా ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పురాణాల ప్రకారం మన ఆలోచనలకు కేంద్ర బిందువు చంద్రుడు. అమావాస్య కావడంతో ఆరోజున చంద్రుడు ప్రభావం మనిషిపై ఉండదు. మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు. వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలని.. మనసుపై నియంత్రణ లేకపోతే చేసే ప్రతి పనిపై, మాట్లాడే ప్రతి మాటపై నియంత్రణ కోల్పోతామని.. అందుకే ఆ రోజును అంత శుద్ధికరణతో ధ్యానం పాటించాలని భగవద్గీత చెబుతున్నట్టు తెలుస్తోంది.
మౌని అమావాస్య రోజును త్రివేణి సంగమంలో జలాలు అమృతంతో సమానంగా ఉంటాయని.. ఈ సమయంలో స్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని చెబుతున్నాయి. పురాణాలు ఈ రోజునే నాగసాధువుల్లో చేరే వారికి దీక్ష ఇస్తారు. రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి, పితృదేవతలకు తర్పణం పెడతారు. అందుకే ఈ రోజున సాధువులతో పాటు యోగిపుంగవులు సైతం ఎంతో ప్రత్యేకమైన రోజుగా గుర్తిస్తారు.