‘నాలుగేండ్లలో అసలు సినిమా చూపిస్తాం’
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పుష్ప సినిమా ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబానికి ఇంతవరకు పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు.
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పుష్ప సినిమా ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబానికి ఇంతవరకు పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు.
సినిమా చూడటానికి వెళ్ళిన కుటుంబంలో మహిళా చనిపోతే ఇప్పటి వరకు హీరో కానీ.. నిర్మాత కానీ.. వారిని ఇంతవరకు పరమర్శించకపోవడం దుర్మార్గమన్నారు. కనీసం హాస్పిటల్లో ఉన్న ఆ బాలుని దగ్గరికి కూడా వెళ్ళలేదన్నారు. బాధితులను వెళ్లి కలవకపోయినా కూడా కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదన్నారు.
మానవత్వం లేని ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే.. నీచంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క పూట జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులంత క్యూ కడుతున్నారని.. క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో ఒక్కరైన ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. అల్లు అర్జున్ వ్యవహార శైలి చూస్తే సిగ్గేస్తుందన్నారు.
ప్రాణాలు పోయినా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నాడని, హీరో స్థాయి తగ్గించాల్సిన అవసరం మాకు లేదని.. మనిషి ప్రాణం పోయినా లెక్కలేదా..? అని ప్రశ్నించారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారన్నారు. బిజెపి అడ్డగోలుగా జీఎస్టీ పెంచుతుందని, దానిపైన కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు.
గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్లలేదన్నారు. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి, ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవడానికి పది సంవత్సరాల కాలం సరిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులను భగవంతుడు కూడా కాపాడలేరన్నారు.
అసెంబ్లీలో మాట్లాడమంటే రోజుకో వేషం వేస్తూ పబ్బం గడిపారని అన్నారు. మీ అబద్ధాలు ప్రజలు నమ్మరని.. మీరు చరిత్ర హీనులిగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. పొన్నాల లక్ష్మయ్య మీద మాకు అపారమైన గౌరవం ఉంది కానీ.. ఆయన కాపాడుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీని విమర్శించిన పెద్దమనిషి.. ఇవాళ అదే పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు.
అనంతరం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని మీరు బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల కుప్పగా మార్చారన్నారు. అసెంబ్లీ సమావేశాలు సినిమాలతో పోలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు రైతు రుణమాఫీ చేయరు.. వీళ్ళ వల్ల కాదు అన్నారని, ఈరోజు రైతు రుణమాఫీ చేయించి చూపించామన్నారు.
మీరు పది సంవత్సరాల్లో చేయలేనిది మేము ఒక సంవత్సరంలోనే చేసి చూపించామన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే గడిచిందని, ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయని గుర్తుచేశారు. మిగిలిన నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మిర్జా అజీజ్జుల్లా బేగ్, కూర వెంకట్, బొమ్మతి విక్రం, పులి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ పుప్పాల ప్రభాకర్, సురేందర్, మొహమ్మద్ సమాద్, బాబా భాయి, నల్ల సత్యనారాయణ, ఇనుగుల రాంప్రసాద్, యూసఫ్, గౌస్, గాండ్ల స్రవంతి, కోడిపాక గణేష్పాల, బి.శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: శ్రీ చైతన్య పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడోత్సవాలు
‘నాలుగేండ్లలో అసలు సినిమా చూపిస్తాం’