Viral Video: ముదిరిన రీల్స్ పిచ్చి.. కదులుతున్న ట్రైన్ నుంచి వేలాడుతూ వెకిలి చేష్టలు, పిచ్చి డ్యాన్సులు
ఇప్పుడు యువతలో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫేమస్ కావాలని కోరుకుంటూ, కొంత మంది యువత అనవసరంగా ప్రమాదకర చర్యలు చేస్తున్నారు.
Viral Video: ఇప్పుడు యువతలో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫేమస్ కావాలని కోరుకుంటూ, కొంత మంది యువత అనవసరంగా ప్రమాదకర చర్యలు చేస్తున్నారు. లైక్స్, ఫాలోవర్స్ కోసం తమ ప్రాణాలకే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో యువతలో రీల్స్ పిచ్చి తీవ్రంగా పెరిగింది.
వేగంగా వెళ్తున్న రైలు దరిమిలా వీడియోలు తీస్తూ రీల్స్ చేయడం, ప్రమాదకరంగా స్టంట్లు వేయడం వంటి చేష్టలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యువతి చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ నెట్టింట వైరల్ అయింది. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఆ యువతి డోర్ వద్ద హ్యాండిల్‌కి వేలాడుతూ డ్యాన్స్ చేసింది. కొంచెం జాగ్రత్తలేకపోతే ఆమె ట్రైన్ నుంచి కిందపడే ప్రమాదం ఉండేది. అంతేకాదు, వెకిలి చేష్టలతో చలాకీగా డ్యాన్స్ చేస్తూ నవ్వుతూ స్టంట్ చేసింది.
ரீல்ஸ் மோகம் – ஓடும் ரயிலில் படிக்கட்டில் நின்று ஆபத்தான ஆட்டம் போட்டு இன்ஸ்டாவில் பதிவிட்ட கன்னியாகுமரி மாவட்டம் நாகர்கோவிலை சேர்ந்த இளம்பெண்.!
இப்பெண் மீது ரயில்வே துறை கடும் நடவடிக்கை எடுக்க வேண்டும் என சமூக வலைதளவாசிகள் கருத்து.#Kanyakumari #Kanniyakumari#Train #Reels… pic.twitter.com/YLdW5EBZMc
— Kᴀʙᴇᴇʀ – தக்கலை கபீர் (@Autokabeer) June 1, 2025
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తక్షణమే ఈ వీడియోను రైల్వే శాఖకు, తమిళనాడు పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయనీ, ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే రీతిలో స్టంట్లు చేయడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఇటువంటి పనులు ఇతర యువతకు చెడు ఉదాహరణలవుతాయని హెచ్చరించారు.
వీడియోపై వచ్చిన ఆగ్రహానికి ఆ యువతి స్పందించింది. అలా రైలు డోర్ వద్ద డ్యాన్స్ చేయడం తప్పనని తనకు ముందుగా తెలియలేదని చెప్పింది. ఇప్పుడు వీడియో వైరల్ కావడంతో తనకు అనవసరమైన కష్టాలు వచ్చాయని చెప్పింది. ఇకపై ఇలాంటి వీడియోలు చేయబోనని, చేసిన తప్పుకు నెటిజన్లను క్షమాపణ కోరింది. ఆ వీడియోను కూడా తాను డిలీట్ చేసినట్లు తెలిపింది.
Also Read: Deccan Queen: ట్రైన్ 96 వ బర్త్ డే.. కేక్ కట్ చేసి గ్రాండ్గా సెలబ్రేషన్స్
Viral Video: ముదిరిన రీల్స్ పిచ్చి.. కదులుతున్న ట్రైన్ నుంచి వేలాడుతూ వెకిలి చేష్టలు, పిచ్చి డ్యాన్సులు