Viral video: ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచం మనిషి జీవితంలో భాగమైపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియా ఫీడ్‌లలో మునిగిపోతున్నారు. ఫాలోవర్లు పెంచుకోవడం, వైరల్ కావడం అనే మోజులో చాలా మంది విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఫేమస్ కావాలని కొందరు వింత విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు సరదా వీడియోలతో అందరినీ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఒక యువకుడు కూరగాయలు కొనడానికి మార్కెట్‌కి వెళ్లాడు. కానీ అతని చేతిలో సంచులు లేకపోవడంతో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా తన షార్ట్‌ని సంచిలా మార్చుకుని వచ్చాడు. ఆ షార్ట్‌ను కింద భాగంలో కట్టి, అందులో కూరగాయలు వేసుకుని తిరుగుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అక్కడ ఉన్న మహిళలు అతని ఈ తతంగాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ ఘటనను చూసిన వారంతా ఇదేంటో అని ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోను @proaleena అనే యూజర్ X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దాదాపు ఆరువేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. చాలామంది లైక్‌లు, కామెంట్లు చేసి తమ అభిప్రాయాలను తెలిపారు. “ఇది ఏ రకమైన బ్యాగ్?” అని కొందరు సరదాగా రాయగా, “మార్కెట్‌లో కొత్త బ్యాగ్ ట్రెండ్ మొదలైంది” అని ఇంకొందరు చమత్కరించారు. మరికొందరు “మీరు ఏమి చూస్తున్నారు?” అని హాస్యంగా స్పందించారు.
ఇలాంటి వినోదాత్మక వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి రోజూ కనిపిస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరి విన్యాసం, మరొకరి ప్రతిభ, ఇంకొకరి సృజనాత్మకత, ఇలా ప్రతీ క్షణం కొత్తదేదో మన ఫీడ్‌లోకి వస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటి వీడియోలు మనకు కొంత నవ్వు తెప్పించినా, సోషల్ మీడియా ప్రభావం ఎటువంటి దిశలో నడుస్తుందో అనే ఆలోచన కూడా కలగడం సహజం.
ALSO READ: Secret: ఏనుగులు ఎన్నేళ్లైనా ఎలా గుర్తుంచుకుంటాయో తెలుసా..?
Viral video: షార్ట్‌నే బ్యాగ్‌గా మార్చిన యువకుడు


