Viral Video: పెళ్లి అంటే ప్రేమ, పందిళ్లు, పూల వర్షం, తాళంబ్రాలు, మూడుముళ్లు, ఏడడుగులు అని మనం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు కాలం మారిపోయింది. పెళ్లిళ్లలో పాటలు, నృత్యాలు మాత్రమే కాకుండా ఫిట్నెస్ పోటీలు కూడా రంగు చేర్చుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో దీనికి నిదర్శనం. ఈ వీడియోలో సాధారణ పెళ్లి వేడుక వాతావరణం కాకుండా, అచ్చం జిమ్ పోటీ వాతావరణంలా కనిపిస్తోంది.
వధువు తరపువారు, వరుడి తరపువారు ఇద్దరూ కలిసి సందడి చేస్తుండగా, వధువు స్నేహితురాలు, నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీఖా కోహ్లీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వధువుతో స్నేహం కారణంగా వచ్చిన కోహ్లీని చూసి వరుడి స్నేహితులు సరదాగా పుష్ అప్స్ పోటీకి ఆహ్వానించారు. సరదాగా మొదలైన ఆ సవాల్ క్రమంగా కసరత్తు పోటీలా మారింది. ఇద్దరూ బంధుమిత్రుల చప్పట్ల నడుమ పోటీ మొదలుపెట్టారు.
మొదట ఇద్దరూ ఉత్సాహంగా పుష్ అప్స్ చేయడం ప్రారంభించారు. క్రమంగా అలసటతో యువకుడు వెనుకబడగా, శ్రీఖా కోహ్లీ మాత్రం తన స్థైర్యం కోల్పోకుండా కొనసాగించింది. చివరికి ఆ యువకుడు చేతులెత్తి ఓటమిని ఒప్పుకున్నాడు. నీదే విజయం అంటూ కోహ్లీని అభినందించాడు. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ నవ్వులతో మునిగిపోయారు.
పెళ్లి వేడుకలో ఇలా పుష్ అప్స్ పోటీ జరగడం అందరికీ కొత్త అనుభవంగా మారింది. వీడియోలో కనిపించిన ఆనందం, ఉత్సాహం, నవ్వులు సోషల్ మీడియాలో నెట్టింట అంతా విస్తరించాయి. ఫిట్నెస్, సరదా, స్నేహం కలిసిన ఈ వినూత్న వేడుక చూసిన నెటిజన్లు ఈ పెళ్లి నిజంగా రొటీన్‌కు భిన్నంగా ఉందని అంటున్నారు. శ్రీఖా కోహ్లీ ప్రదర్శన ఆమె క్రీడా స్పూర్తిని చూపించిందని చాలామంది అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: Excellent driving: రెండు చేతులు లేకున్నా బైక్‌ను రఫ్పాడిస్తున్నాడు..!
Viral Video: పెళ్లి వేడుకలో పుష్ అప్స్ పోటీ.. యువకుడిని మట్టికరిపించిన యువతి


