Viral Video: రోడ్డు మధ్యలో కౌగిలింతలు.. వీడియో వైరల్
పూణెలోని పింప్రి-చించ్‌వాడ్‌లోని పింపుల్ సౌదాగర్ నుండి వచ్చిన ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

Viral Video: పూణెలోని పింప్రి-చించ్‌వాడ్‌లోని పింపుల్ సౌదాగర్ నుండి వచ్చిన ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇందులో ఒక జంట రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో కౌగిలించుకుంటున్నట్లు చూపిస్తోంది. ఈ వీడియోలో, వాహనాలు ఆగిపోయినప్పుడు ఆ జంట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆలింగనం చేసుకుంటున్నారు. ఇలా వారు బహిరంగంగా కౌగిలించుకోవడంతో అంతా వారినే చూస్తుండిపోయారు. దీంతో చుట్టు పక్కల ఉన్నవారు జోక్యం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. వెంటనే, ట్రాఫిక్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో, ఆ జంట సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయారు.
View this post on Instagram
ఈ సన్నివేశాన్నంతటినీ ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను కొందరు “స్టేజ్డ్” అని పిలిచారు. “ఈ రోజుల్లో కంటెంట్ కోసం ప్రజలు ఏదైనా చేస్తున్నారు” అని ఒకరు వ్యాఖ్యానించారు. “ఇది మరాఠీ సినిమా షూటింగ్” అని మరొకడు చమత్కరించారు. “బాబు భయ్యా ఆ మహిళతో ఎఫైర్ నడుపుతున్నాడు” అని అన్నారు. “ఆ జంటకు సహాయం చేసినందుకు ట్రాఫిక్ పోలీసుకు సెల్యూట్” అని ఇంకొకరు చెప్పారు.
Also Read : Viral Video: ఫ్యూన్ తో ఎగ్జామ్ పేపర్స్ దిద్దించిన ప్రిన్సిపాల్
Viral Video: రోడ్డు మధ్యలో కౌగిలింతలు.. వీడియో వైరల్