(VIDEO) Naked woman protest: బట్టలు విప్పేసి నగ్నంగా మహిళ నిరసన.. ఎందుకో తెలుసా?
(VIDEO) Naked woman protest: ఇరాన్‌లో మహిళల దుస్తుల నియమావళికి వ్యతిరేకంగా మరో నగ్న నిరసన జరిగింది. ఇరాన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మషాద్‌లో పోలీసు వాహనం పైన ఈ నిరసన జరిగింది.
(VIDEO) Naked woman protest: ఇరాన్‌లో మహిళల దుస్తుల నియమావళికి వ్యతిరేకంగా మరో నగ్న నిరసన జరిగింది. ఇరాన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మషాద్‌లో పోలీసు వాహనం పైన ఈ నిరసన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువతి పోలీసు వాహనం బోనెట్ పై నిలబడి పోలీసు అధికారులను సవాలు చేస్తూ ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత ఆమె విండ్ షీల్డ్ పై రాస్తున్నట్లు కనిపించింది. ఆమెను వాహనం నుంచి కిందకు దించేందుకు అధికారులు ఎంత ప్రయత్నించినా, ఆమె అంగీకరించలేదు. ఒకనొక సమయంలో ఒక పోలీసు అధికారి ఆయుధాన్ని తీయడానికి వాహనంలోకి ప్రవేశించాడు.
అయినప్పటికీ ఆ మహిళ ఎలాంటి సంకోచం లేకుండా నిరసనను కొనసాగించింది. ఆ మహిళలు అలా బట్టలు లేకుండా నిలబడి ఉండడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేకపోయారు. కానీ ఆ తర్వాత ఏమైందన్న విషయంపై ఎలాంటి వివరాలు తెలియలేదు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ కావడంతో.. చాలా మందికి ఆమెకు మద్దతు పలికేందుకు ముందుకు వచ్చారు.
🇮🇷 BREAKING: In Iran, a woman strips naked and climbs onto a police car in a protest against the current Islamic government.pic.twitter.com/9dko7uLayZ
— TacticalEdge (@EdgeE50124) February 5, 2025
ఇరాన్ లో ఇంతకుముందు కూడా ఇలా కొందరు మహిళలు నగ్నంగా నిరనసలు తెలిపిన సందర్భాలున్నాయి. టెహ్రాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ మహిళా విద్యార్థిని కేవం లో దుస్తులు మాత్రమే ధరించి క్యాంపస్ కు చేరుకుని నిరసన తెలిపింది.
ఆమె నిరసన చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లో పెళ్లారని కొన్ని నివేదికలు తెలిపాయి.
ALSO READ: Sadistic husband: భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్
(VIDEO) Naked woman protest: బట్టలు విప్పేసి నగ్నంగా మహిళ నిరసన.. ఎందుకో తెలుసా?