VIDEO: పెళ్లానికి తగ్గ పెనిమిటి తోడైతే మాములుగా ఉండదు మరి
VIDEO: ఒక భారతీయ గృహిణి తన విదేశీ భర్తతో కలిసి వేసిన నృత్యం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. 'అఖా ఇండియా జనతా హై' అనే బాలీవుడ్ క్లాసిక్ పాటకు వారు చేసిన డ్యాన్స్ నెటిజన్ల మనసులను ఆకట్టుకుంటోంది.
VIDEO: ఒక భారతీయ గృహిణి తన విదేశీ భర్తతో కలిసి వేసిన నృత్యం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘అఖా ఇండియా జనతా హై’ అనే బాలీవుడ్ క్లాసిక్ పాటకు వారు చేసిన డ్యాన్స్ నెటిజన్ల మనసులను ఆకట్టుకుంటోంది. జమున అనే యూజర్ జూన్ 6న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియో ఒక సాధారణ వంటగది సన్నివేశంతో మొదలవుతుంది. చీర ధరించి, నుదిటిపై సింధూరంతో, భారతీయ సంప్రదాయ గృహిణిగా కనిపించే మహిళ వంటకు సన్నద్ధమవుతుంది. మొదట్లో ఇది ఎప్పుడూ చూసే “గ్రేట్ ఇండియన్ కిచెన్” తరహా దృశ్యంగా అనిపిస్తుంది. ఆమె స్టవ్‌పై ప్రెషర్ కుక్కర్ పెట్టే దృశ్యంతో వీడియో ప్రారంభమవుతుంది.
అయితే కొద్ది క్షణాల్లో వీడియోకు మలుపు వచ్చేసింది. నీలిరంగు టీ షర్ట్, నల్ల షార్ట్‌లో ఉన్న విదేశీ భర్త కిచెన్‌లోకి ప్రవేశిస్తాడు. అప్పటిదాకా శాంతంగా ఉన్న సన్నివేశం ఊహించని విధంగా డ్యాన్స్ షోగా మారిపోతుంది. భర్త మొదలుపెట్టిన ఆ డ్యాన్స్‌ను చూసి, భార్య వెంటనే తన పని ఆపి, స్టెప్పుల ద్వారా జత కలుస్తుంది. ఆ తరువాత ఇద్దరూ కలసి బాలీవుడ్ స్టైల్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.
వీడియోలో ముఖ్యంగా “ఫస్ట్ టైమ్ దేఖా తుమ్హేన్ హమ్ ఖో గయా” అనే డైలాగ్‌కు భర్త ఎమోషన్‌తో లిప్‌సింక్ చేయడం, అందులో చూపిన టైమింగ్, అందమైన వ్యక్తీకరణ నెటిజన్లకు చాలా నచ్చింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆశ్చర్యకరమైన భావోద్వేగం, చలాకీ కదలికలు చూసి ప్రేక్షకులు వీడియోపై ప్రేమగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే ఈ వీడియోకు రెండు లక్షలకుపైగా వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి. కామెంట్స్‌లో నెటిజన్లు ఈ జంటను ప్రశంసిస్తూ, హృదయపు స్మైలీలతో, డ్యాన్స్ ఎమోజీలతో తమ అభినందనలను తెలియజేస్తున్నారు.
ALSO READ: Stadium Stampede: బెంగళూరు తొక్కిసలాటకు కారణాలివే..!
VIDEO: పెళ్లానికి తగ్గ పెనిమిటి తోడైతే మాములుగా ఉండదు మరి