Snakes: మనుషులే కాదు.. పాములకూ హనీమూన్ స్పాట్ ఉంది.. 75వేల పాములు సయ్యాటలాడే స్థలమిదే
లైఫ్ ను ఎంజాయ్ చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం వంటివి కేవలం మనుషులు మాత్రమే చేస్తారని ఇన్నాళ్లు అనుకున్నాం. హనీమాన్ అనగానే కొడైకెనాల్, గోవా, మాల్దీవులు లాంటి ప్రదేశాల పేర్లు చెబుతుంటారు.
Snakes: లైఫ్ ను ఎంజాయ్ చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం వంటివి కేవలం మనుషులు మాత్రమే చేస్తారని ఇన్నాళ్లు అనుకున్నాం. హనీమాన్ అనగానే కొడైకెనాల్, గోవా, మాల్దీవులు లాంటి ప్రదేశాల పేర్లు చెబుతుంటారు. కానీ మీకు తెలుసా.. పాములకు కూడా అలాంటి ప్లేస్ ఒకటుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రతి వసంతకాలంలో జరిగే మానిటోబాలోని నార్సిస్సే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాముల సమూహం. ఈ కార్యక్రమం ప్రకృతి సౌందర్యానిక సాక్షంగా నిలుస్తుంది. ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుంది.. అక్కడ పాములు ఏం చేస్తాయి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కెనడాలోని మానిటోబాలోని నార్సిస్సేలో ప్రతి వసంతకాలంలో వేలాది పాములు గుహల నుంచి బయటికొస్తాయి. ఇక్కడ కనిపించే పాములు మామూలువి కాదు రెడ్-సైడెడ్ గార్టర్ స్నేక్. అంటే ఒక వైపు ఎర్రటి రంగు ఉన్న గార్టెర్ పాములు. అయితే ఏటా జరిగే ఈ పాముల సమావేశాన్ని నార్సిసస్ స్నేక్ డెన్స్ అంటారు. చాలా నెలలుగా నిద్రాణస్థితిలో ఉన్న ఈ పాములు సున్నపురాయి సింక్‌హోల్స్ నుంచి బయటపడి తమ హనీమూన్‌కు వెళ్తాయి. వాతావరణం వేడెక్కడం ప్రారంభించినప్పుడు ఏప్రిల్ చివరి నుంచి మే ప్రారంభంలో.. మగ పాములు బయటకు వచ్చి ఆడ పాముల కోసం వేచి ఉంటాయి. ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు 75,000 నుంచి 150,000 వరకు ఒక వైపు ఎర్రటి రంగు ఉన్న గార్టెర్ పాములు సంభోగం కోసం సమావేశమవుతాయి. మరో ముఖ్య విషయమేమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద పాముల సంభోగ సమావేశం ఈ నెలలోనే జరగనుంది.
ఈ సమావేశం ఒక రకమైన హనీమూన్ లాంటిది. అక్కడ వారాలు లేదా నెలల తరబడి సమయం గడుపుతాయి. అయితే ఆడ పాముల కోసం కొత్తగా వచ్చిన పాముల మధ్య పోటీ ప్రారంభమవుతుంది. ఆడ పాముల కోసం మగ పాములలో పోటీ ఉంటుంది. ఆడపాముని గెలవడానికి ప్రేమ పోరాటంలో మగ పాములు పాల్గొంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. నార్సిసస్‌లో పాములు హనీమూన్‌కు ఎందుకు వెళ్తాయి అన్న విషయానికొస్తే.. మానిటోబాలోని ఇంటర్‌లేక్ ప్రాంతంలోని ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఈ పాములు జతకట్టడానికి అనువైన పరిస్థితులను అందిస్తాయి. ఈ ప్రాంతం సున్నపురాయితో రూపొందించబడి ఉంటుంది.
ఈ సమావేశాన్ని మనుషులమైన మనం కూడా చూడొచ్చు. సాధారణంగా ఇది ఏప్రిల్ చివరిలో లేదా మే మొదటి మూడు వారాలలో ఎండ ఉన్న రోజులలో జరుగుతుంది. అయితే 3 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే చూసేందుకు వీలు ఉంటుంది. పాములను రక్షించడానికి ఇక్కడ ఒక ప్రత్యేక బృందం కూడా ఉంటుంది. అక్కడి ప్రభుత్వం కూడా పాముల ప్రాణాలను కాపాడటానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఏదైమైనా మనకే కాదు జీవులకు సంబంధించి ఇలాంటి విచిత్రమైన విషయాలు తెల్సినపుడు ప్రపంచంలోని వింతల్లో ఇదీ ఒక వింత అనిపిస్తూంటుంది.
Also Read: Cosmetic Surgery: పబ్లిక్ స్టంట్ పేరుతో పిల్లిలా మారాలనుకుంది.. చివరికి అందవిహీనంగా మారి..!
Snakes: మనుషులే కాదు.. పాములకూ హనీమూన్ స్పాట్ ఉంది.. 75వేల పాములు సయ్యాటలాడే స్థలమిదే