స్టార్ త్రినేత్రం క్యాలెండర్ ఆవిష్కరించిన TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు
స్టార్ త్రినేత్రం, ఐనవోలు: ఐనవోలు మండలకేంద్రంలో బుధవారం TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు స్టార్ త్రినేత్రం దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
స్టార్ త్రినేత్రం, ఐనవోలు: ఐనవోలు మండలకేంద్రంలో బుధవారం TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు స్టార్ త్రినేత్రం దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్టార్ త్రినేత్రం పత్రిక జర్నలిజంలో కొత్త ప్రమాణాలు ఏర్పరచాలని అన్నారు.
నూతనంగా ప్రారంభమైన స్టార్ త్రినేత్రం పత్రిక ఎల్లవేళలా ప్రజల గుండెల్లో విశ్వాసాన్ని సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో స్టార్ త్రినేత్రం పాత్ర ప్రత్యేకంగా ఉండాలని, ఇది పత్రికా స్వేచ్ఛకు అద్భుతమైన ఉదాహరణగా నిలవాలని పేర్కొన్నారు.
దీని ద్వారా సామాజిక, ఆర్థిక విషయాలపై ప్రజల అవగాహన పెరుగుతుందని చెప్పారు. వర్ధన్నపేట జిల్లా ప్రజల అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని, పత్రికా స్వేచ్ఛకు అండగా నిలుస్తానని వారు తెలిపారు.
ALSO READ: Game Changers: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి
స్టార్ త్రినేత్రం క్యాలెండర్ ఆవిష్కరించిన TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు