సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఇల్లంద సర్కారు బడి వజ్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మనదేశ మొదటి మహిళ ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే 194వ జయంతి సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 3వ తేదీని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు.

అనంతరం సామాజిక కార్యకర్త మోడెం కుమారస్వామి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలైన సామాజికంగా వెనుకబడిన, అస్పృశ్యతకు లోనయే పేద మహిళలకు విద్య నేర్పించడంలో ఎనలేని కృషి చేశారన్నారు. ప్రత్యేకంగా మహిళలకు పాఠశాలలను ప్రారంభించి స్త్రీ జనావధరణకు కృషి చేశారన్నారు.
ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వాలు వారి పుట్టినరోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఆనందదాయకం అని కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉన్నత, ప్రాథమిక, ప్రైవేటు పాఠశాలలైన మా బడి, కాకతీయ, అంగన్వాడీ కేంద్రాలలోని మహిళా ఉపాధ్యాయినీలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వజ్రోత్సవ కమిటీ నుండి మోడెం కుమారస్వామి, రాయపురపు కుమారస్వామి, ఎద్దు సత్యం, పోశాల వెంకన్న, నాంపల్లి యాకయ్య, పోశాల సురేష్, పెందోట మహంత్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ALSO READ: బాధిత కుటుంబానికి పీఏసీఎస్ రాజేష్ ఖన్నా పరామర్శ
సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు