Viral Video: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఫన్నీ ఔట్ ఇది

Sports Viral

Viral Video: క్రికెట్‌లో ఎప్పుడూ ఏం జరగబోతోంది అనేది ఊహించలేం. అప్పుడప్పుడు ఆటగాళ్లు, బౌలర్లు ఊహించని విధంగా రికార్డులు సృష్టిస్తారు. అలాంటి అరుదైన సంఘటన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL) గుయానా అమేజాన్ వారియర్స్ ఆటగాడు షాయ్ హోప్ అవుట్ అయిన విధానం. హోప్ 28 బంతుల్లో 39 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, నైట్ రైడర్స్ బౌలర్ టెర్రన్స్ హిండ్స్ వేసిన వైడ్ బంతిని రివర్స్ ర్యాంప్ షాట్ కొడతాననుకుంటూ బ్యాట్స్‌తో స్టంప్స్‌ను తాకి అనుకోకుండా హిట్-వికెట్ అవుట్ అయ్యాడు.

దీంతో ఆశ్చర్యపోయిన కామెంటేటర్లు, అభిమానులు సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్‌గా దీనిని చర్చిస్తున్నారు. కొందరు నెటిజన్లు వైడ్ బంతికి కూడా వికెట్ ఇవ్వగలరా అని ఆశ్చర్యపడ్డారు. హోప్ అవుట్ అయినప్పటికీ వారియర్స్ జట్టు 9 వికెట్ల నష్టంతో 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రొమారియో షెపర్డ్ (19), డ్వైన్ ప్రిటోరియస్ (21), క్వెంటిన్ సాంప్సన్ (25) వంటి ఆటగాళ్లు కీలక పరుగులు సృష్టించారు.

నైట్ రైడర్స్ తరఫున అకీల్ హొసేన్ 27 పరుగులకు 3 వికెట్లు, టెర్రన్స్ హిండ్స్ 35 పరుగులకు 2 వికెట్లు తీశారు. లక్ష్యం చేరుకునే క్రమంలో ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (74) మరియు కొలిన్ మున్రో (52) 116 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పి జట్టు విజయాన్ని సులభతరం చేశారు. ఫలితంగా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ALSO READ: Local Body Elections: సెప్టెంబర్ 10లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్

Viral Video: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఫన్నీ ఔట్ ఇది