Viral Video: సముద్రం అనేది భూమిపై ఉన్న అత్యంత రహస్యమైన లోకం. దాని లోతుల్లో మన కంటికి కనిపించని అనేక రకాల జీవులు, జాతులు దాగి ఉంటాయి. వాటిలో కొన్ని మనకు తెలిసిన వాటికి భిన్నంగా, పూర్తిగా వింతగా కనిపించే జీవరాశులు. అలాంటి అరుదైన జీవుల్లో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జీవి చూడటానికి సాధారణంగా కనిపించినా, దానికి ముట్టుకున్న వారు ప్రాణాపాయం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, ఓ సముద్రజీవి రిబ్బన్‌లా పొడవుగా కదులుతూ కనిపిస్తుంది. ఇది ప్రశాంతంగా ఉండే జీవి అయినప్పటికీ, ఎవరైనా దాన్ని తాకడానికి ప్రయత్నిస్తే లేదా హాని చేయాలని చూస్తే, వెంటనే తెల్లటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఆ ద్రవంలో ఉండే రసాయనాలు మానవ శరీరానికి అత్యంత ప్రమాదకరమని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీడియోలోని వ్యక్తి కూడా ఈ జీవి ముట్టుకున్నా ప్రాణాలు పోవచ్చని, ఇది సాధారణ సముద్రపురుగు కాదని వివరిస్తున్నాడు.
రిబ్బన్ పురుగులు సముద్రపు లోతుల్లో నివసించే ఒక ప్రత్యేక జాతి. ఇవి నీలి తిమింగలం కంటే కూడా ఎక్కువ పొడవు పెరగగలవు. ప్రపంచంలోనే అతి పొడవైన జంతువులుగా వీటిని గుర్తించారు. వేటాడే సమయంలో ఇవి తమ ఎరను చుట్టుముట్టి విషపూరిత ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఆ ద్రవం ఎరను స్తంభింపజేసి, కదలకుండా చేస్తుంది. ఆ తరువాత దాన్ని మెల్లగా మింగేస్తాయి.
రిబ్బన్ పురుగుల శరీరంలో టెట్రోడోటాక్సిన్ అనే శక్తివంతమైన విషపదార్థం ఉంటుంది. ఇదే విషం కొంతమంది చేపల్లో కూడా ఉంటుంది. ఇది మానవుల చర్మాన్ని తాకినా తీవ్రమైన అలెర్జీ, చర్మకోపం, పక్షవాతం వంటి సమస్యలకు దారి తీస్తుంది. తక్కువ మోతాదులోనే ఇది ప్రమాదకరమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఇలాంటి సముద్రజీవులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, సముద్ర తీరాలకు దగ్గరగా కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
సముద్రపు లోకంలోని ఈ రహస్య జీవులు మనకు తెలియని ఎన్నో శాస్త్రీయ అద్భుతాల్ని తెలియజేస్తాయి. కానీ వాటి అందాన్ని ఆస్వాదించడమే గాని, వాటితో సన్నిహితమవ్వడం మాత్రం పెద్ద ముప్పుగా మారవచ్చు. కనుక ఇలాంటి వీడియోలను కేవలం సమాచారంగా మాత్రమే తీసుకోవాలి, వాటిని అనుకరించకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Fist clenching method: మీ పిడికిలి చెబుతుంది.. మీరు ఎవరనేది
Viral Video: ఇదొక వింత జీవి.. మనుషులు ముట్టుకుంటే అంతే సంగతట?


