రోడ్డుపై గుంతలు పూడ్చిన పోలీసులు
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జాతీయ రహదారి 563పై మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ లీక్ అయి పెద్ద గుంతలు పడటంతో రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది.

రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు. ఈ విషయంపై ఇటీవల పలు దినపత్రికలు కూడా వార్తను ప్రచురించాయి. ఈ విషయంపై వర్ధన్నపేట ఎస్సై రాజు స్పందించారు.
వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర వర్మ ఆదేశాల మేరకు ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎస్సై మెరుగు రాజు, సిబ్బంది, మిషన్ భగీరథ RWS DE శ్రీనివాస్, ఏఈ ఫణింద్ర, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ వారి సిబ్బందితో కలిసి శనివారం రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ: suicide: ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. కోడలే కారణమంటోన్న బాధితుడి తండ్రి
రోడ్డుపై గుంతలు పూడ్చిన పోలీసులు