Thabeti Rajendram: మచ్చలేని వ్యక్తి తాబేటి రాజేంద్రం
స్టార్ త్రినేత్రం, వరంగల్: తాబేటి రాజేందర్ (రాజేంద్రం) పదవీ విరమణ సందర్భంగా ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభను మంగళవారం హనుమకొండ లస్కర్ బజార్‌లోని ప్రభుత్వ అభ్యసన్నోత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఘనంగా నిర్వహించడం జరిగింది.
– ఘనంగా రాజేందర్ ఉద్యోగ విరమణ
స్టార్ త్రినేత్రం, వరంగల్: తాబేటి రాజేందర్ (రాజేంద్రం) పదవీ విరమణ సందర్భంగా ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభను మంగళవారం హనుమకొండ లస్కర్ బజార్‌లోని ప్రభుత్వ అభ్యసన్నోత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఘనంగా నిర్వహించడం జరిగింది. తాబేటి రాజేంద్రం సిద్దాపూర్‌లోని జనవరి 1, 1964లో తాబేటి నర్సయ్య- వీరమ్మలకు నాల్గవ సంతానంగా జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు సిద్ధాపూర్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల హనుమకొండలో 8 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం గావించారు. ఆ తదుపరి జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి, కాకతీయ డిగ్రీ కళాశాలలో బీ.కామ్ డిగ్రీ చదివారు. మహారాష్ట్రలోని అమరావతి యూనివర్సిటీలో బీ.పీ.ఈ.డీ. క్రీడా విద్యగావించారు. వెనువెంటనే మరాట్వాడ యూనివర్సిటీలో యం.పీ.ఈ.డీ పట్టాదార్ అయ్యారు. చదువుపై ఎక్కువ మక్కువతో, జ్ఞాన పిపాసతో కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఏ. (తెలుగు) చేశారు. నూతనంగా ఏదో ఒకటి సాధించి వారి గ్రామంలో నూతన అధ్యాయం సృష్టించాలని తపించి కొంతకాలం ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా చేస్తున్న క్రమంలో 1992లో డీఎస్సీ పడగానే కసితో కృషిచేసి అందులో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి, 1993లో వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ)గా మొదటి నియామకం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాజీపేట (బాలుర)లో 1998 వరకు శక్తివంచన లేకుండా పని చేసినందుకు ఆ పాఠశాల నుండి అథ్లెటిక్‌లో 20 మంది క్రీడాకారులు జాతీయస్థాయి వివిధ రంగాలలో రాణించారు. 1998 నుండి 2009 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాలెంలో తమ విధిని కాయం మరిచి కష్టించారు. పాలెం పాఠశాల నుంచి 100 మంది వరకు బాక్సింగ్, హ్యాండ్ బాల్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్‌లో జాతీయ ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. 2009 లో బదిలీయై మూడు నెలలు ప్ర.ఉ.పా. ములుగులో సేవలు అందించారు. మరలా 2009 అక్టోబర్‌లో పదోన్నతిపై ప్రభుత్వ ఉన్నత పాఠశాల హనుమకొండకు వచ్చి 2018 వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తదుపరి 2018 నుంచి 2022 వరకు ప్ర.ఉ.పా.శంభునిపేటలో ఉన్నతమైన సేవలందించారు. 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రభుత్వ అభ్యసనోన్నత పాఠశాలలో ఆదర్శమైన సేవలందించారు. వారి సేవలను గుర్తించి 2022లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ వారు సత్కరించారు.
స్థిత ప్రజ్ఞులు..
రాజేంద్రం ప్రతి క్షణం పిల్లలు ఏ విధంగా ఆడాలి, ఏ ఆటలో రాణిచగలరు. ఏ స్థాయి వరకు ఆడతారో తెలిసిన స్థిత ప్రజ్ఞులు వారు వందల మందిని రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి, రాటుతేలి, జాతీయ స్థాయిలో కుడా ఆ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో యోగితారెడ్డి, ఈ.నరేష్, అహ్మద్, శివకుమార్, సందీష్, సురేష్ లాంటివారు అంతర్జాతీయ స్థాయిలో కెనడా, మలేషియా, జపాన్, సింగపూర్ లాంటి దేశాలల్లో తమ ప్రతిభను చాటారు. ఇవి వారి యొక్క కీర్తి కిరీటంలో వజ్రాలు. చీదరించుకునే వారిని కుడా మందికి ఆర్థికంగా ఆదరించి, ఆటలలో, ‘చదువులల్లో, ఉద్యోగాలల్లో ఆదరించి మక్కువతో అక్కున చేర్చుకున్న ఆదర్శ పురుషుడివి ఎంతో రాణించేటట్లుగా ఉద్యోగంలో చేరిన నుండి ఉద్యోగ విరమణ వరకు కొనసాగించారు. ఇవన్నీ వారి లోని మానవతకు మచ్చుతునక వృత్తిధర్మంలో ఎంతో నేర్పుతో, ఓర్పుతో సేవలందించారు. ఈ ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు, అమ్మ ఆదర్శ సందర్భంగా సన్మాన సభలో రాజేంద్రం ను ప్రధానోపాధ్యాయులు, గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి పాఠశాల కమిటీ వారు ఘనంగా సన్మానించి వారు చేసిన సేవలను గృహస్థధర్మాన్ని కూడా ఆదర్శవంతంగా నిర్వర్తించారని పదవీ విరమణ అనంతరం పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో జీవితాంతం వరకు సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరున్ని కోరుకుంటూ… శతమానం భవతి అంటూ వారిని అభినందించారు.
సత్కరించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం..
మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ.. తాబేటి రాజేంద్రం మచ్చ లేని వ్యక్తి అని విద్యార్థులకు ఆటలలో క్రమశిక్షణతో అవగాహన కలిపించేవారని అన్నారు. తమ వృత్తిలో ఎంతో ఓర్పు, నేర్పుతో సేవలందించారని గుర్తు చేశారు. వారు వారి కుటుంబ సభ్యులు జీవితాంతం వరకు సంతోషంగా ఉండాలని కోరారు. అనంతరం రాజేంద్రం ను దాస్యం వినయ్ భాస్కర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్ధినీ విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు పెద్ద కూతురు అల్లుడు ఐలి శ్రావణి – వంశీకృష్ణ, చిన్న కూతురు – అల్లుడు బొల్లపెల్లి చందన – రఘు, కొడుకు-కోడలు
తాబేటి మౌనిక సతీష్, మనుమలు-మనుమరాళ్లు విఘ్నేష్, అర్విక్, శ్రీ సాన్వి, సమన్విత, శ్రీ లీనా, అన్విక, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: భార్యలు రాసిన మరణ శాసనం
Thabeti Rajendram: మచ్చలేని వ్యక్తి తాబేటి రాజేంద్రం