TGCAB Jobs 2025: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల సహకార బ్యాంకుల్లో మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 6, 2025లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో 32, కరీంనగర్‌లో 43, ఖమ్మంలో 99, మహబూబ్‌నగర్‌లో 9, మెదక్‌లో 21, వరంగల్‌లో 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యం, ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. తెలంగాణ రాష్ట్ర స్థానికులకే దరఖాస్తు హక్కు ఉంది.
వయోపరిమితి అక్టోబర్ 1, 2025 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు, దివ్యాంగులకు 10–15 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతం లభిస్తుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ https://tgcab.bank.in/ లో అందుబాటులో ఉన్నాయి.
ALSO READ: Plants: మీ ఇంటికి పేదరికం తీసుకువచ్చే నాలుగు మొక్కలు ఇవే..?
TGCAB Jobs 2025: డిగ్రీతో ఈ జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చు


