గడువులోగా లక్ష్యాలను సాధించాలి: మార్నేని రవీందర్ రావు
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీలోని డిసిసిబి బ్యాంక్‌లో రాయపర్తి, నందనం, ఐనవోలు, వర్ధన్నపేట సోసిటీలు మరియు ఐనవోలు, వర్ధన్నపేట డీసీసీబీ బ్యాంకుల మేనేజర్లు, నోడల్ అధికారులు, సొసైటీ సిబ్బందితో మంగళవారం తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ కింద లబ్ధిపొందిన రైతులకు తిరిగి కొత్త పంట ఋణాలు ఇవ్వాలని, సాంకేతిక కారణాలతో పంట రుణమాఫీ కానీ రైతుల ఖాతాలు మెరుగుపరిచి వారికి మాఫీ లబ్ధి చేకూరేలా చూడాలని అన్నారు. సంఘాల ద్వారా ఇచ్చి ఉన్న ఋణాలను కూడా లీగల్‌గా కవర్ చేసి రికవరీ చేయాలని, బ్యాంకు లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని సృష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, డిపాజిట్లు, బంగారు రుణాలపై దృషిసారిస్తూ బ్యాంకు అభివృద్దికి సహకరించాలని సిబ్బందికి తెలియజేశారు.
ఈ సమీక్ష సమావేశంలో నోడల్ అధికారినీ ఏజిఏం గొట్టం స్రవంతి, బ్రాంచ్ మేనేజర్లు సమత, శ్రావణ్, బద్రునాయక్, నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు, వర్ధన్నపేట & రాయపర్తి పాక్స్ చైర్మన్లు రాజేష్ ఖన్నా, రామచంద్ర రెడ్డి, సొసైటీ సీఈఓలు వెంకటయ్య, యాదగిరి, సంపత్, సోమయ్య, సిబ్బంది సురేష్, సమ్మయ్య, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: teeth: ఇలా చేస్తే ముత్యాల్లా మెరిసే పళ్లు మీ సొంతం
గడువులోగా లక్ష్యాలను సాధించాలి: మార్నేని రవీందర్ రావు