Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
Ande Sri: ప్రముఖ ప్రజాకవి, రచయిత అందెశ్రీ ఇక లేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ ఆదివారం రాత్రి లాలాగూడలోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమానికి తన స్ఫూర్తిదాయక గీతాలతో ఉత్సాహం నింపిన అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” పాటను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించింది. […]


