Mahesh Babu: పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి

Mahesh Babu: మరికొన్ని గంటల్లో మహేశ్ బాబు, రాజమౌళి సినిమా సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ భారీ స్థాయిలో హైదరాబాద్‌లో జరగనుంది. శనివారం, నవంబరు 15 సాయంత్రం ఈ వేడుక హైదరాబాద్ శివారులో నిర్వహించబడుతుంది. గత కొన్నిరోజుల్లో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నందున, కార్యక్రమాన్ని పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహించనున్నారు. డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే వీడియో ద్వారా తగు సూచనలు, జాగ్రత్తలు తెలిపారు. మహేశ్ బాబు సూచనలు ఇప్పుడు హీరో మహేశ్ బాబు అభిమానులకు సూచనలు అందించారు. ఈవెంట్‌లో పాల్గొనాలంటే […]

So Much Talent: అసలు ఇతను మనిషా..? రబ్బరు బొమ్మనా..?

So Much Talent: ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ నెటిజన్ల మనసును కట్టిపడేస్తుంటాయి. అలాంటిదే తాజాగా ఒక్క వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. ఆ వీడియో మొదట చూశారంటే ఇది నిజమా కాదా అనే సందేహమే కలుగుతుంది. చాలా మంది దీన్ని చూసి “ఇది ఏఐతో చేసిన వీడియో అయి ఉండొచ్చా?” అని ఆలోచిస్తారు. కానీ కాదు, ఇది కృత్రిమ మేధస్సుతో సృష్టించబడినది కాదు, నిజజీవితంలో ఒక మనిషి […]

Viral video: షార్ట్‌నే బ్యాగ్‌గా మార్చిన యువకుడు

Viral video: ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచం మనిషి జీవితంలో భాగమైపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫోన్‌ చేతిలో పట్టుకుని సోషల్ మీడియా ఫీడ్‌లలో మునిగిపోతున్నారు. ఫాలోవర్లు పెంచుకోవడం, వైరల్ కావడం అనే మోజులో చాలా మంది విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఫేమస్ కావాలని కొందరు వింత విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు సరదా వీడియోలతో అందరినీ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక […]

Secret: ఏనుగులు ఎన్నేళ్లైనా ఎలా గుర్తుంచుకుంటాయో తెలుసా..?

Secret: ఏనుగులు అనగానే మనకు గుర్తుకొచ్చేది వాటి భారీ శరీరం, పెద్ద తొండం, పొడవైన దంతాలు. కానీ, వాటి అసలు శక్తి వాటి జ్ఞాపకశక్తిలో ఉంటుంది. ఏనుగులు జంతుజగత్తులో అత్యంత తెలివైనవిగా పేరుగాంచినవి. అవి మనుషుల్లా భావోద్వేగాలు కలిగి ఉంటాయి. స్నేహం అంటే అర్థం తెలిసిన జీవులు. పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం.. ఏనుగులు దశాబ్దాల పాటు వందల మంది వ్యక్తులను, వలస మార్గాలను, గతంలో ఎదురైన అనుభవాలను గుర్తుంచుకోగలవు. ఏనుగుల గుంపును సాధారణంగా పెద్ద ఆడ […]

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

Ande Sri: ప్రముఖ ప్రజాకవి, రచయిత అందెశ్రీ ఇక లేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ ఆదివారం రాత్రి లాలాగూడలోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమానికి తన స్ఫూర్తిదాయక గీతాలతో ఉత్సాహం నింపిన అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” పాటను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించింది. […]

Viral Video: పెళ్లి వేడుకలో పుష్‌ అప్స్‌ పోటీ.. యువకుడిని మట్టికరిపించిన యువతి

Viral Video: పెళ్లి అంటే ప్రేమ, పందిళ్లు, పూల వర్షం, తాళంబ్రాలు, మూడుముళ్లు, ఏడడుగులు అని మనం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు కాలం మారిపోయింది. పెళ్లిళ్లలో పాటలు, నృత్యాలు మాత్రమే కాకుండా ఫిట్నెస్ పోటీలు కూడా రంగు చేర్చుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో దీనికి నిదర్శనం. ఈ వీడియోలో సాధారణ పెళ్లి వేడుక వాతావరణం కాకుండా, అచ్చం జిమ్ పోటీ వాతావరణంలా కనిపిస్తోంది. వధువు తరపువారు, వరుడి తరపువారు ఇద్దరూ […]

Excellent driving: రెండు చేతులు లేకున్నా బైక్‌ను రఫ్పాడిస్తున్నాడు..!

Excellent driving: శారీరక లోపాలు ఉన్నా మనసు దృఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదని మరోసారి నిరూపించిన ఘటన ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రెండు చేతులు లేకుండానే బైక్‌ను అద్భుతంగా నడుపుతూ కనిపించాడు. అతను ఓ బైక్‌పై సమతుల్యతను అద్భుతంగా కాపాడుతూ స్పీడ్‌గా నడిపిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దూరం నుండి చూస్తే సాధారణ రైడర్‌లాగా అనిపించినా, దగ్గరగా చూసినప్పుడు అతనికి చేతులు లేవని […]

Kidney stones: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు తెలుసా?

Kidney stones: మన శరీరంలో మూత్రపిండాలు లేదా కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. ఇవి రక్తంలోని వ్యర్థాలను వడకట్టి, అదనపు నీటిని మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఉప్పు, ఆమ్ల-క్షార (pH) స్థాయిలను సమతుల్యం చేస్తూ రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, ఈ ముఖ్యమైన అవయవాల్లో రాళ్లు ఏర్పడితే ఆరోగ్యం తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. మూత్రపిండాల్లో పేరుకుపోయిన ఖనిజాలు కలసి ఘన స్ఫటికాలుగా మారి రాళ్లుగా […]

Viral video: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రేమ జంట రొమాన్స్‌

Viral video: నడిరోడ్డుపైనే నలుగురు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా ప్రేమలో మునిగిపోయిన ఓ జంట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కోల్‌కతా నగరంలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చిత్రీకరించిన ఈ వీడియోలో, బైక్‌పై కూర్చున్న యువకుడు, యువతి ఒకరికొకరు చాలా దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటూ, నవ్వుతూ కనిపిస్తున్నారు. చుట్టూ వాహనాలు, పాదచారులు ఉన్నా, వీరికి ఆ విషయం పట్టనట్లుంది. ఆ క్షణాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది […]

Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం

జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]