Son kills father brutally at vizianagaram dist

Andhra: వీడు మనిషా, మృగమా.. తండ్రి గుండెలపై గునపంతో మోది, కిరాతకంగా హత్య

Andhra: విజయనగరం జిల్లాలో ఘోరమైన దారుణం వెలుగులోకి వచ్చింది. బొండపల్లి మండలం కొండకిండాంలోని 72 ఏళ్ల పెదమజ్జి నాయుడు బాబును తన కన్న కొడుకు గణేష్ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి విషయంలో ఉద్రిక్తత కారణంగా ఈ ఘటన జరిగింది. కొన్ని రోజులుగా తండ్రి బాబు, కుమారుడు గణేష్ మధ్య భూమి, ఆస్తి సమస్యపై వివాదం సాగుతుండగా, గత పదిహేను రోజుల క్రితం ఒక ఘర్షణలో తండ్రికి కాలు విరిగిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. తండ్రి తన […]

Man Gets 4 Degreees, 3 PGs Completed in Jail at Kadapa

Andhra: రియల్లీ గ్రేట్.. జైల్లో ఉంటూనే 4 డిగ్రీలు, 3 పీజీలు కంప్లీట్ చేశాడు

Andhra: జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ విద్యారంగంలో గొప్ప స్థానం సంపాదించాడు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెంగాలపల్లికి చెందిన జి. యుగంధర్ (43) అనే వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆ కేసులో నేరం నిర్ధారించడంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2010 నుంచి కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్నప్పటికీ చదువు మీద ఆసక్తి కోల్పోలేదు. దూరవిద్య ద్వారా […]

Mother leaves new born baby in bucket at giddaluru of Andhra Pradesh

Andhra: ఏం తల్లివమ్మా.. బకెట్‌లో బిడ్డను వదిలి పరార్!

Andhra: ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం ఓ గర్భిణీ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆ సమయంలో అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆమె నేరుగా వాష్‌రూమ్‌కి వెళ్లి ప్రసవించింది. మగ శిశువుకు జన్మనిచ్చిన ఆ తల్లి, బిడ్డను బాత్రూమ్ బకెట్లో వదిలేసి వెళ్లిపోయింది. శిశువు ఏడుపు విని ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై తలుపు తెరిచారు. లోపల పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే శిశువును బయటకు […]

moneylender brutall murdered at proddutur of kadapa dist

Andhra: అప్పు ఇచ్చిన పాపానికి.. వడ్డీ వ్యాపారి దారుణ హత్య

Andhra: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన ఓ హత్య కేసు అక్కడి ప్రజల్లో కలకలం రేపింది. అవసరానికి డబ్బు అప్పు తీసుకున్ని దాన్ని వారు తిరిగి చెల్లించకుండా, నమ్మకాన్ని ఒమ్ము చేసి, వేణుగోపాల్రెడ్డి(54) ప్రాణాలు తీసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కుందూ నదిలో పడేసి పరారయ్యారు. వేణుగోపాల్రెడ్డి స్వగ్రామం పోరుమామిళ్ల మండలం రెడ్డికోట. ఆయన భార్య ప్రమీలాదేవి, కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి, కుమార్తె స్వప్న ఉన్నారు. ప్రొద్దుటూరులోని బొల్లవరంలో స్థిరపడి వడ్డీ వ్యాపారం […]

Boy swallows screwdriver drill kit in Andhra Pradesh

Tragedy: స్క్రూడ్రైవర్ డ్రిల్ కిట్ మింగిన బాలుడు

Tragedy: ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాన్ని భద్రాచలం ప్రభుత్వ వైద్యులు కాపాడారు. తుమ్మల గౌతమ్ అనే చిన్నారి పొరపాటున ఆరు సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ డ్రిల్ బిట్ మింగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పాఠశాల నుంచి వచ్చి ఇంట్లో ఆటలాడుతుండగా బాలుడు డ్రిల్ బిట్‌ను మింగేశాడు. కొద్ది సేపటికి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి వయసును పరిగణనలోకి తీసుకుని అనుమానంతో ఎక్స్‌రే […]

wife, son commited suicide due to heavy debts at Guntur dist

Tragedy: అప్పు పెను ముప్పు.. భయంతో తల్లి, కుమారుడు ఆత్మహత్య

Tragedy: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రెండు కుటుంబాలను కుదిపేసింది. కేవలం రూ.50 వేల అప్పు కారణంగా ఇద్దరి ప్రాణాలు బలవ్వగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఆరు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లకు రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు చెల్లించే సమయం రాగానే, శ్రీనివాసరావు పలుమార్లు అడిగినా వెంకటేశ్వర్లు తప్పించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో […]

Farmers worried due to Onion Rates Falling in Andhra Pradesh

Onion Rates: ఫర్ ది ఫస్ట్ టైం.. కిలో ఉల్లి రూ.30 ఫైసలు

Onion Rates: ఇటీవల వరకూ రైతులకు కొంత ఆశ చూపించిన ఉల్లి ధరలు ఇప్పుడు వారికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కర్నూలు మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ చరిత్రలో ఇంత తక్కువ ధర ఇదే మొదటిసారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లికి అర్ధ రూపాయి కూడా రాకుండా పోయింది. మార్కెట్‌కు భారీగా ఉల్లి సరఫరా అవుతుండటంతో ధరలు కుప్పకూలాయి. మార్క్‌ఫెడ్‌ క్వింటాకు రూ.1,200కి కొనుగోలు చేస్తోంది. […]

AP Vahanamitra: Dussehra gift.. Rs. 15 thousand for auto and cab drivers.. How to get it..

AP Vahanamitra: దసరా గిఫ్ట్.. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఎలా పొందాలంటే..

AP Vahanamitra: ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. తాజాగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. దసరా కానుకగా వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్‌ ఖాతాలో రూ.15,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో డ్రైవర్లు సంతోషంలో మునిగిపోయారు. ఈ నిధులు ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌, వాహన రిపేర్ వంటి ఖర్చులకు ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు […]

Seniors beated junior in hostel ove dispute on shirt buttoon at kunool

Ragging: షర్ట్ గుండీ తెచ్చిన తంటా.. హాస్టల్ లో జూనియర్ ను చితకబాదిన సీనియర్స్

Ragging: కర్నూలు జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ ఘటన మరోసారి కలకలం రేపింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై మూడో ఏడాది విద్యార్థులు దాడి చేసిన విషయం బయటకు రావడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. వివరాల్లోకి వెళ్తే, సీనియర్లు ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థిని “షర్ట్ బటన్ పెట్టుకుని క్లాస్‌కి రావాలి” అని చెప్పారు. దీనికి అతడు “సరే, బటన్ పెట్టుకుని వస్తానులే” అని సమాధానం ఇవ్వడంతో ఆ సమాధానమే సీనియర్లకు నచ్చకపోయిందట. దాంతో నూతన […]

Rising diarrhoea cases in Vijayawada

Diarrhoea: విజయవాడను వణికిస్తోన్న డయేరియా.. 115 కేసులు నమోదు

Diarrhoea: విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులు క్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 115 కేసులు నమోదయ్యాయి. వీరిలో 54 మంది చికిత్స పూర్తిచేసుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 61 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ ప్రత్యేక మెడికల్ క్యాంప్ కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్యులు ప్రజలకు కాచిన నీరే తాగాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కొత్త కేసులు రావడం […]