Sydney Sweeney: స్నానపు నీటితో సోప్ తయారు చేసి అమ్ముతోన్న హీరోయిన్.. ఎగబడి కొంటున్న జనాలు
‘యూఫోరియా’, ‘ఎనీవన్ బట్ యూ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా పాదం మోపాలనుకున్న ఆమె తాజాగా ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.
Sydney Sweeney: ‘యూఫోరియా’, ‘ఎనీవన్ బట్ యూ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా పాదం మోపాలనుకున్న ఆమె తాజాగా ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. తన స్నానపు నీటిని సబ్బుగా మార్చి అమ్ముతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
పురుషుల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్ డాక్టర్ స్క్వాచ్తో కలిసి, ‘సిడ్నీస్ బాత్‌వాటర్ బ్లిస్’ అనే లిమిటెడ్ ఎడిషన్ సబ్బును విడుదల చేసింది. ఈ సోప్ ప్రత్యేకత ఏంటంటే… ఇది సిడ్నీ స్వీనీ స్నానంలో వాడిన నీటి స్పర్శను కలిగి ఉండడం. అలాగే, ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్ శాండ్, పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్, పైన్, ఫిర్ వంటి ఆకుపచ్చ వాసనల మిశ్రమం ఉంది. ఈ ప్రత్యేక సబ్బును కేవలం 5,000 బార్లు మాత్రమే తయారు చేసి, సుమారుగా రూ. 500 ధరకు విక్రయించారు. విడుదలైన వెంటనే అభిమానులు ఎగబడి కొనుగోలు చేశారు.
తన అభిమానులు తరచూ అడిగే “నీ స్నానపు నీరు కావాలంటూ” కామెంట్లకు ఇదే తన గిఫ్ట్ అంటూ సిడ్నీ చెప్పింది. సహజమైన, పరిశుభ్రమైన ఉత్పత్తులను ప్రోత్సహించడమే ఈ ఐడియా వెనక ఉద్దేశమని, అలాగే తన అభిమానులతో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకోవడానికే ఈ ప్రయత్నమని వివరించింది. అయితే ఈ మార్కెటింగ్ స్టంట్‌కి స్పందనలు మిశ్రమంగా వచ్చాయి. కొందరు సిడ్నీ ఆలోచనను పొగిడితే, మరికొందరు మాత్రం ఇది ఓన్లీఫ్యాన్స్ తరహా పబ్లిసిటీ అని విమర్శించారు. ఒక ఏ-లిస్ట్ నటి ఇలాంటి ప్రచారాల్లో ఎందుకు పాల్గొంటుందోనని ప్రశ్నించేవారూ ఉన్నారు.
ఇలాంటి విషయం తొలిసారి కాదు. ఇప్పటికే 2019లో బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్సర్ బెల్లె డెల్ఫిన్ కూడా తన స్నానపు నీటిని చిన్న జార్లలో ప్యాక్ చేసి, ఒక్కోటి దాదాపు రూ. 2600కి విక్రయించింది. మూడు రోజుల్లోనే ఆమె రూ. 77 లక్షలు సంపాదించింది. అయితే ఆ నీరు తాగడం కోసం కాదు, కేవలం ‘సెంటిమెంటల్ పర్పసెస్’ కోసమే అన్న డిస్క్లైమర్ కూడా జత చేసింది. ఆమె మార్కెటింగ్ కూడా ఆ క్రిటిక్స్ కి కొంత హాస్యాస్పదంగా, కొంతమంది అభిమానులకి మాత్రం ఆసక్తికరంగా కనిపించింది. కొందరు ఆ జార్లను eBayలో వేల రూపాయలకు రీసేల్ చేయడానికి కూడా ట్రై చేయగా, ఆ లిస్టింగ్స్‌ను తొలగించారు. మొత్తానికి… సెలెబ్రిటీ మార్కెటింగ్‌లో కొత్తదనం ఉండాలని నిరూపించిన ప్రయత్నమిది. కానీ ఇది అందరికీ నచ్చుతుందా? అనేది ఇంకా చర్చనీయాంశమే.
Also Read: Alert: మీక్కూాడా ఈ మెసేజ్ లు వస్తున్నాయా.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే చాలా డేంజర్
Sydney Sweeney: స్నానపు నీటితో సోప్ తయారు చేసి అమ్ముతోన్న హీరోయిన్.. ఎగబడి కొంటున్న జనాలు