Summer Holidays : సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయోచ్.. అప్పట్లో ఎలా ఉండేదంటే..
వేసవి సెలవులు.. బాల్యంలో, చదువుకునే సమయంలో ఈ మాట కన్నా ఆనందాన్నిచ్చే పదం మరొకటి ఉండేది కాదేమో. ఇప్పుడంటే ఫోన్లు, సోషల్ మీడియా అంటూ జీవితం మొత్తం ఆన్ లైన్ కే పరిమితమైంది.
Summer Holidays : వేసవి సెలవులు.. బాల్యంలో, చదువుకునే సమయంలో ఈ మాట కన్నా ఆనందాన్నిచ్చే పదం మరొకటి ఉండేది కాదేమో. ఇప్పుడంటే ఫోన్లు, సోషల్ మీడియా అంటూ జీవితం మొత్తం ఆన్ లైన్ కే పరిమితమైంది. కానీ ఒకప్పుడు పూర్తి విభిన్నంగా ఉండేది. ఎండలో వెళితే ఏమైపోతుందోనని ఇప్పుడు ఇంట్లోనే టీవీలు, ఫోన్లతోనే సమయం గడిపేస్తున్నారు. కానీ.. అప్పుడు ఎండా, వానా అనే తేడానే లేదు. తొక్కుడు బిళ్ల, దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి, అష్టాచెమ్మా, కర్రబిళ్ల, గోలీలాట అంటా ఎన్నో ఆటలుండేవి.
జనరేషన్ జడ్ అంటూ ఇప్పుడు ఏవేవో కొత్త కొత్త పేర్లు పుట్టుకొచ్చాయి. టెక్నాలజీ పెరుగుతుండడంతో దానికి తగ్గట్టు పోటీ పడుతున్నారు. డెవలప్మెంట్ అన్న విషయాన్ని పక్కన పెడితే ఇన్ని సౌకర్యాలున్నా ఈ తరం యువతీ యువకులు సంతృప్తిగా ఉండలేకపోతున్నారు. చెడు వ్యసనాలు, డబ్బంటే లెక్క లేకపోవడం, సాటి మనుషులను మనుషులుగా చూడకపోవడం, కంప్యూటర్లకే అతుక్కుపోయి డిప్రెషన్, ఒత్తిడి, ఇతర అనారోగ్యాల పాలవుతున్నారు. కానీ ఆ రోజులు ఎలా ఉండేవన్న విషయం మాత్రం కేవలం 90 కిడ్స్ కే తెలుసనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వేసవి సెలవులు వస్తున్నాయంటే చాలు అమ్మమ్మ వాళ్లింటికి ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని చూసేటోళ్లు. రస్నా తాగి ఎర్రటి ఎండకు ఎదురొడ్డి నిలబడేవాళ్లు. పాత టైర్ తో వీధులన్నీ చక్కర్లు కొట్టేవాళ్లు. రోజుకొక్క దెబ్బయినా తాకనిదే ఇంటికొచ్చే వాళ్లు కాదు. ఒక్క రూపాయి ఇచ్చారంటే అదేదో వేలు, లక్షలు ఇచ్చినట్టు ఫీలైపోయేటోళ్లు. అందుకే అప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే అంత హ్యాపీగా ఉండేది.
కానీ ఇప్పుడేముంది ఫోన్లలో గేమ్స్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ అంటూ కూర్చున్న చోటు నుంచి కదలరు. కనీసం చుట్టుపక్కల ఏమవుతుందో కూడా వినిపించుకోరు. తప్పు జనరేషన్ ది కాదు.. అలా అని టెక్నాలజీది కూడా కాదు. కానీ దేన్నయినా మితిమీరి వాడితే వచ్చే అనర్థాలను గుర్తించలేకపోవడం నిజంగా బాధను కలిగించే విషయం. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ ఫోన్ లు లేని రోజులే బాగుండేవని.. సోషల్ మీడియా లేని రోజులే బాగుండేవని.. ఆన్ లైన్ గేమ్స్ అంటూ ఏమీ లేని రోజులే బాగుండేవని.. కాయిన్ బాక్సుల్లో టైం అయిపోతుందని ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడే రోజులే బాగుండేవని.. బయటికెళ్లి స్నేహితులతో ఆటలాడి నిజమైన ఆనందం పొందే ఆ రోజులే బాగుండేవని.. అలా అని కాలాన్ని, జరిగే అభివృద్ధిని మార్చలేం. కానీ వ్యక్తిత్వంలో, మానవత్వం, గౌరవంలో ఆనాటి మనుషులను పోలేలా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా..
Also Read : Bhunga Houses : 200 ఇయర్స్ హిస్టరీ ఉన్న భూకంపం వచ్చినా చెక్కు చెదరని ఇళ్లు
Summer Holidays : సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయోచ్.. అప్పట్లో ఎలా ఉండేదంటే..