సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
స్టార్ త్రినేత్రం, వర్దన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల సమాజంలో ప్రబలుతున్న సైబర్ క్రైమ్ నేరాలపై బుధవారం ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో వర్దన్నపేట పోలీసులు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.
– ఆన్ లైన్ మేసేజ్‌లను నమ్మకూడదు
– ఫోన్‌లలో వచ్చే ఓ టి పిలని ఎవ్వరితో షేర్ చేయకూడదు
– వర్దన్నపేట ఏసీపీ నర్సయ్య
స్టార్ త్రినేత్రం, వర్దన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల సమాజంలో ప్రబలుతున్న సైబర్ క్రైమ్ నేరాలపై బుధవారం ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో వర్దన్నపేట పోలీసులు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపి నరసయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతినెల మొదటి బుధవారం నిర్వహించే కార్యక్రమాన్ని సైబర్ దివాస్ కార్యక్రమము అని అంటారన్నారు. మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మీ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని, ఫోన్ వాడకాన్ని తగ్గించుకుని అందులో వచ్చే సైబర్ మెసేజ్లను ఓపెన్ చేయకుండా, వారు పంపించే ఓటీపీలను ఎవరితో షేర్ చేయకూడదు అన్నారు.
మనసుని మనకు అనుగుణంగా మలుచుకుని ఎలాంటి చెడు అలవాట్లను అలవర్చుకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంట జిల్లా ఎన్సిసి క్యాడర్ అధికారి, ఎస్సైలు భూక్య చందర్, రాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ALSO READ: గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకోకపోయినా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన