Parupati Srinivas Reddy: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు డీకొండ జగన్నాధం ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
దీంతో విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గురువారం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ ఆర్థిక సాయాన్ని ఫౌండేషన్ ప్రతినిధి గజాబెల్లి ప్రసాద్, మాజీ ఎంపీపీ నాగపూరి రాంబాబు, మండల పార్టీ నాయకులు కృష్ణ మూర్తి అయ్యగారు, సంకినేని ఎల్లస్వామి, దోకుడు దేవేందర్ ద్వారా బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాము మనోహర్, సదా శ్రీనివాస్, పోలేపక బిక్షపతి, నాగేంద్ర, డికొండ దేవేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Food: రాత్రి నిద్రకు ముందు ఇవి తింటున్నారా.. ప్లీజ్ చెక్ వన్స్
Parupati Srinivas Reddy: బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్


