Heroine Soundarya: సౌందర్య మరణంపై క్లారిటీ ఇచ్చిన ఆమె భర్త రఘు
Heroine Soundarya: దాదాపు 21 సంవత్సరాల కిందట, అంటే 2004లో ప్రముఖ సినీ నటి సౌందర్య విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడది ప్రమాదం కాదని, హత్య అని వాదన వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై తాజాగా స్పందించిన సౌందర్య భర్త రఘు.. ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు అర్థంలేనివిగా అభివర్ణించారు.
Heroine Soundarya: దాదాపు 21 సంవత్సరాల కిందట, అంటే 2004లో ప్రముఖ సినీ నటి సౌందర్య విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడది ప్రమాదం కాదని, హత్య అని వాదన వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై తాజాగా స్పందించిన సౌందర్య భర్త రఘు.. ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు అర్థంలేనివిగా అభివర్ణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సౌందర్యను సినీ నటుడు మోహన్ బాబే హత్య చేయించాడని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాలో కేసు నమోదైంది. సౌందర్య మరణం ప్రమాదం కాదని, హత్య అని, వారి మధ్య తలెత్తిన భూ వివాదం వల్లే మోహన్ బాబు ఈ పని చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఇప్పుడు, సౌందర్య భర్త జీఎస్ రఘు ఈ విషయంపై వివరణ ఇచ్చారు. వాటిని ‘నిరాధార వార్తలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ‘గత కొన్ని రోజులుగా, హైదరాబాద్‌లోని ఆస్తికి సంబంధించి మోహన్ బాబు, సౌందర్య గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ఆస్తికి సంబంధించి వ్యాపించిన ఈ నిరాధారమైన వార్తలను నేను ఖండిస్తున్నాను. మోహన్ బాబు, నా భార్య దివంగత సౌందర్య నుండి ఎటువంటి ఆస్తిని అక్రమంగా సంపాదించలేదు. నాకు తెలిసినంత వరకు, మేము వారితో ఎప్పుడూ భూమి లావాదేవీలు చేయలేదు’ అని చెప్పారు.
తన కుటుంబానికి మోహన్ బాబుతో మంచి సంబంధం ఉందని రఘు అన్నారు. ‘గత 25+ సంవత్సరాలుగా నాకు మోహన్ బాబు సర్ తెలుసు. మా మధ్య బలమైన, మంచి స్నేహం ఉంది. మా కుటుంబం, నా భార్య, నా అత్తగారు, నా బావ, ఎల్లప్పుడూ పరస్పర నమ్మకం, గౌరవంతో కూడిన లోతైన సంబంధాన్ని కొనసాగించారు. నాక్కూడా మోహన్ బాబు సర్ అంటే గౌరవం ఉంది. మీ అందరితో ఓ నిజం పంచుకోవాలనుకుంటున్నాను. మేమంతా ఒక కుటుంబం లాంటివాళ్ళం. మాకు, మోహన్ బాబు సర్ కు మధ్య ఎటువంటి ఆస్తికి సంబంధించిన లావాదేవీలు జరగలేదు. ఇది తప్పుడు వార్త. మీరందరూ తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ఆపేయాలని అభ్యర్థిస్తున్నాను. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగించాలని కోరుతున్నాను అని చెప్పారు.
సౌందర్య భర్త ఈ విషయంపై మౌనం వీడినప్పటికీ మోహన్ బాబు మాత్రం ఈ విషయంపై ఇంకా మౌనంగానే ఉన్నారు. ఏదైమైనా కానీ రఘు ఇచ్చిన వివరణ తర్వాత, మోహన్ బాబు ఊపిరి పీల్చుకున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందా.. లేదంటే కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. కాగా మోహన్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘కన్నప్ప’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.
ALSO READ: Heroine Soundarya: సౌందర్య మరణంపై క్లారిటీ ఇచ్చిన ఆమె భర్త రఘు
Heroine Soundarya: సౌందర్య మరణంపై క్లారిటీ ఇచ్చిన ఆమె భర్త రఘు