వామ్మొ..! కోర్టు హాలులో పాము కలకలం
స్టార్ త్రినేత్రం, ఆన్‌లైన్ డెస్క్: ముంబై ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం పాము ప్రత్యక్ష్యం కావడం కలకలంరేపింది. కోర్టులోని రూం నెంబర్ 27లో కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ఫైళ్లకు మధ్య దాదాపు 2 అడుగుల పొడవున్న పాము కనిపించడంతో అక్కడున్న వారందరూ భయంతో వణికిపోయారు.

ఈ విషయంపై ఓ న్యాయవాది మాట్లాడుతూ.. పాము కనిపించడంతో కోర్టు రూంలో అందరూ భయాదోళనకు లోనైనట్లు తెలిపారు. జడ్జి కూడా కోర్టు కార్యకలాపాలను కొంతసేపు తాత్కాలికంగా వాయిదా వేశారు. స్నేక్ క్యాచర్‌ను పిలిపించి పాము కోసం కోర్టు హాల్ అంతటా గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
పాత ఫైళ్లన కూడా తొలగించి, చాలా సమయం వరకు గాలించారు అయినా గుర్తించలేకపోయారు. కోర్టు గదిలోని రంధ్రం నుంచి పాము బయటకు వెళ్లి ఉంటొచ్చని భావించారు. గంట సేపు కోర్టు తాత్కాలిక వాయిదా వేసి, అనంతరం కోర్టు కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించారు. అయితే కోర్టు ఆవరణలో పాములు కనిపించడం ఇది తొలసారి ఏమీ కాదని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు.
ALSO READ: (VIDEO): బాలికల హాస్టల్ సమీపంలో అలికిడి.. వెళ్లి చూస్తే షాక్
వామ్మొ..! కోర్టు హాలులో పాము కలకలం