Snake: పాము పడగ వెనక రహస్యం తెలుసా?

Snake: వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో పొదలు, చెట్లు తడిసి, పాములు, కీటకాలు ఆవాసాల నుంచి బయటకు రావడం సాధారణం.

Snake: వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో పొదలు, చెట్లు తడిసి, పాములు, కీటకాలు ఆవాసాల నుంచి బయటకు రావడం సాధారణం. చాలాసార్లు పాములు ఇళ్లలోకి చొరబడి జనాలను భయపెడతాయి. ఈ సందర్భంలో నాగుపాములు కూడా ఇల్లు, దారుల్లో కనిపిస్తూ ఉంటాయి. నాగుపాములు చాలా ప్రమాదకరమైన పాములు. వాటిని చూసిన కొందరు భయంతో పరిగెత్తిపోతుంటారు. ఒక్కసారి కాటు వేసేలా అయితే, ప్రాణాలకే ప్రమాదం. నాగుపాము విషం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నాగుపాములు ఇప్పటికే చాలా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగుపామును దగ్గరగా చూశారు అంటే, అది పడగ విప్పడం కూడా చూడవచ్చు. అసలు నాగుపాము పడగ ఎందుకు విప్పుతుందో మీకు తెలుసా? నిపుణుల చెబుతునట్లు, నాగుపాము పడగను విస్తరించడం కేవలం తనను గమనించిన వారికి భయపడేలా చేయడానికే. నాగుపాము శత్రువులను భయపెట్టడానికి మాత్రమే పడగ విప్పుతుందట.

నిపుణుల వివరాల ప్రకారం, నాగుపాములు తమ పొడవైన పక్కటెముకలను విస్తరించి ఆ పడగను విప్పుతాయి. ఇలా పడగ విప్పడం వల్ల అవి మరింత భయంకరంగా కనిపిస్తాయి. నాగుపాము పడగ విస్తరించిందంటే అది దాడికి సిద్ధమై ఉంది అని భావించాలి. ఆ సమయంలో పాముకు దగ్గరగా ఉండక తప్పించుకోవడం ఉత్తమమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: Bride: లాస్ట్ మినిట్ లో పెళ్లికి నో చెప్పి.. ప్రియుడితో పరార్

Snake: పాము పడగ వెనక రహస్యం తెలుసా?

📲 Follow Us

Star Trinethram

Star Trinethram (Telugu News) is Top News Source That Provide Latest and Breaking News in Telugu. Read Andhra Pradesh, Telangana, National and International Telugu News Updates Online. News on Politics, Business, Entertainment, Technology, Sports, Lifestyle and more at startrinethram.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *