Urine: మీ మూత్రం నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు, చికిత్స
మూత్రంలో దుర్వాసన రావడం సాధారణంగా కొంతమందిలో కనిపించే సమస్య. కానీ అకస్మాత్తుగా మూత్రానికి గాఢమైన, అసహ్యమైన వాసన రావడం ప్రారంభమైతే మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
Urine: మూత్రంలో దుర్వాసన రావడం సాధారణంగా కొంతమందిలో కనిపించే సమస్య. కానీ అకస్మాత్తుగా మూత్రానికి గాఢమైన, అసహ్యమైన వాసన రావడం ప్రారంభమైతే మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు. మూత్ర విసర్జన సమయంలో కొంచెం నురగ రావడం సహజం. ఇది సాధారణంగా శరీరంలోని ద్రవ సమతుల్యతను సూచించే లక్షణమే. అయితే నిత్యం నురగ వస్తూ, దుర్వాసన కూడా ఉంటే మాత్రం ఇది సమస్యకి సంకేతం కావచ్చు. ముఖ్యంగా, ఇది మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్ (UTI), లేక మూత్రంలో ప్రొటీన్‌లు (సుద్ద/అల్బుమిన్) వెళ్తున్న సూచన అయి ఉండొచ్చు.
మూత్రంలో సుద్ద ఎక్కువగా రావడం అనేది కిడ్నీ సరైన పనితీరును కోల్పోతున్నదాని సూచన కావచ్చు. దీనికి కారణాలు ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, లేక గ్లోమరులర్ నెఫ్రయిటిస్ వంటి కిడ్నీ సంబంధిత వ్యాధులు కావచ్చు. ఈ పరిస్థితుల్లో కిడ్నీని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా మూత్రపరీక్ష (Urine Test) చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలో ఇన్‌ఫెక్షన్ ఉందా, సుద్ద పోతుందా అనే విషయాలు బయటపడతాయి. అవసరమైతే రక్తంలో క్రియాటినిన్ స్థాయిని కూడా పరీక్షించి, కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
ఈ రెండు పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్నా, అంటే కిడ్నీలు బాగా పని చేస్తున్నా, మూత్రంలో సుద్ద లేని పరిస్థితిలో మాత్రం అధికంగా నురగ కనిపించినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఫలితాల్లో ఏవైనా అసాధారణతలు కనిపిస్తే, తదుపరి పరీక్షలు చేయించి అసలు కారణాన్ని గుర్తించాలి. ఇంకా, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ తేలితే డాక్టర్ సూచన మేరకు యాంటీబయోటిక్స్ వాడాలి. కిడ్నీకి సంబంధించి ఇతర వ్యాధులు నిర్ధారణ అయితే తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. సంక్షిప్తంగా చెప్పాలంటే, మూత్రంలో వాసన, నురగ రావడం లాంటి మార్పులు చిన్నవిగా కనిపించినా, అవి ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. కాబట్టి ముందస్తుగా జాగ్రత్తగా పరీక్షలు చేయించుకొని, అవసరమైన చికిత్స తీసుకోవడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం.
Also Read: Crime News: ప్రేమను ఒప్పుకోలేదని 18 సార్లు స్క్రూడైవర్ తో పొడిచి యువతిని హత్య
Urine: మీ మూత్రం నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు, చికిత్స