Chanakya Niti: ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్యుడు కేవలం రాజనీతి శాస్త్రజ్ఞుడే కాదు.. జీవితాన్ని సక్రమంగా గడపడానికి మార్గదర్శకుడుగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన చెప్పిన చాణక్య నీతిలో వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, దాంపత్య బంధం గురించి అనేక ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన చెప్పిన సూత్రాలు చాలా మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా, భార్యాభర్తలు కలిసి చేయకూడని కొన్ని పనులను ఆయన స్పష్టంగా చెప్పారు.
ధ్యానం విషయంలో జాగ్రత్తలు
చాణక్యుడి ప్రకారం.. భార్యాభర్తలు ఒకేసారి కలిసి ధ్యానం చేయకూడదు. ఎందుకంటే, ధ్యానం అంటే మనసును ఒక దిశలో కేంద్రీకరించడం. ఇద్దరూ ఒకేసారి చేస్తే పరధ్యానంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా, ధ్యానం యొక్క అసలు ఫలితాన్ని పొందలేరు. అందువల్ల భార్యాభర్తలు విడివిడిగా ధ్యానం చేయడం శ్రేయస్కరమని ఆయన సూచించారు.
చదువులో శ్రద్ధ
చదువుకోవడం అనేది మనిషి జీవితాన్ని మార్చే గొప్ప సాధనం. అయితే, చాణక్యుడు భార్యాభర్తలు ఒకేసారి కలిసి చదువుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే.. ఒకరి మీద ఒకరికి దృష్టి మళ్లి చదువులో అంతరాయం కలుగుతుంది. కాబట్టి చదువులో శ్రద్ధ పెట్టాలంటే వేరువేరుగా కూర్చుని చదువుకోవాలని సూచించారు.
బట్టలు మార్చుకోవడంపై సూచనలు
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్త్రీ పురుషులు ఒకరి ముందు ఒకరు బట్టలు మార్చుకోవద్దని చాణక్యుడు అన్నారు. భార్యాభర్తలు అయినప్పటికీ, ఇలాంటి వ్యక్తిగత విషయాలు వేరుగా జరగాలని ఆయన భావించారు. బట్టలు మార్చుకోవడం లేదా సరి చేసుకోవడం ఒకరి ముందు ఒకరు చేయడం మంచిది కాదని ఆయన నొక్కి చెప్పారు. ఇది దాంపత్య బంధంలో మర్యాద, గౌరవం నిలుపుకునేలా చేస్తుందని ఆయన సూచన వెనుక ఉద్దేశం.
ఆచార్య చాణక్యుడి సూత్రాల ప్రాముఖ్యత
చాణక్యుడి ఈ సూచనలు ఆధ్యాత్మిక దృక్పథం మాత్రమే కాకుండా, మానసిక స్థైర్యానికి కూడా దోహదం చేస్తాయి. భార్యాభర్తలు వేరువేరుగా కొన్ని పనులు చేస్తే, పరస్పర గౌరవం పెరుగుతుంది. అంతేకాక, వ్యక్తిగత స్థలాన్ని (personal space) కాపాడుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. దాంపత్య జీవితం కేవలం ప్రేమతోనే కాదు, పరస్పర గౌరవంతో కూడా బలపడుతుంది.
ALSO READ: Teacher Cruelty: ఒకటో తరగతి విద్యార్థిపై టీచర్ దాడి!
Chanakya Niti: భార్యాభర్తలు ఈ పనులను కలిసి చేయకూడదట?


